P Krishna
P Krishna
ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అస్సలు అర్థం కావడం లేదు. గత నెల వరుసగా దిగివచ్చిన బంగారం ఇటీవల మళ్లీ పెరిగిపోయింది. ఏకంగా వారంలో మూడు వేల వరకు బంగారం ధరలు పెరిగిపోయాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయని వెనకడుగు వేస్తున్న వారికి గుడ్ న్యూస్.. పసిడి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. గత సెన్సెషన్ లో గోల్డ్ రేటు పెరిగినప్పటికీ నేడు భారీగా పడిపోయింది. ఇజ్రాయెల్-పాలస్తినా యుద్ద కారణంగా బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తుంది. మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గత పదిరోజుల నుంచి పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. తాజాగా మహిళలకు ఓ గుడ్ న్యూస్.. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబద్, విశాఖ, విజయవాడలో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,950 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో వెండి కిలో రూ.77వేల వద్ద కొనసాగుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.60,100 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు లాంటి ముఖ్య నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.54,950ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.59,950 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.60,160 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా లో నేడు వెండి కిలో రూ. 73,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద ట్రెండ్ అవుతుంది.