P Krishna
Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది. పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది. మరోవైపు బంగారం ధలు ఆకాశాన్నంటిపోతున్నాయి. ఒకటీ రెండు రోజులు మాత్రం స్వల్ప ఊరటనిస్తున్నాయి.
Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి మొదలైంది. పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది. మరోవైపు బంగారం ధలు ఆకాశాన్నంటిపోతున్నాయి. ఒకటీ రెండు రోజులు మాత్రం స్వల్ప ఊరటనిస్తున్నాయి.
P Krishna
ఇటీవల పసిడి, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో కోనుగోలుదారులకు అస్సలు అర్థం కావడం లేదు. జనవరి, ఫిబ్రవరి మాసంలో భారీగా తగ్గిన బంగారం ధరలు మార్చి, ఏప్రిల్ నెలలో చుక్కలు చూపించాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.75 దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత పదిహేను రోజుల్లో మూడు రోజులు మాత్రమే ధరలు కాస్త ఊరటనిచ్చాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయంటే..
పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప ఊరట. ఈ రోజు పసిడి, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోతూ వస్తున్న బంగారం ధరలు ఒకటీ రెండు రోజుల మాత్రం కాస్త బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత షరా మాములే అన్నట్టు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు కావడంతో పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.72,920 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ. 66,840 వద్ద కొనసాగుతుంది. వెండి ధర కిలోపై రూ.100 తగ్గి రూ.83,900 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,070 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.67,990 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,750 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.67,690 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,920 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.66,840 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 84,000 వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ. 87,500 వద్ద ట్రెండ్ అవుతుంది.