iDreamPost
android-app
ios-app

ఇదే మంచి సమయం.. మిస్ అయితే నష్టపోతారు! నేడు పసిడి ధర ఎంతంటే?

  • Published Apr 19, 2024 | 9:48 AM Updated Updated Apr 19, 2024 | 9:48 AM

Gold and Silver Rates: ప్రపంచంలోో అత్యంత విలువైన బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్నంటిపోతున్నాయి. పసిడి కొనాలంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Gold and Silver Rates: ప్రపంచంలోో అత్యంత విలువైన బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్నంటిపోతున్నాయి. పసిడి కొనాలంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇదే మంచి సమయం.. మిస్ అయితే నష్టపోతారు! నేడు పసిడి ధర ఎంతంటే?

మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి కి కాస్త బ్రేక్ పడినట్లయ్యింది. బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. వరుసగా పసిడి ధరలు పెరుగుతూ ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కేవలం రెండు నెలల వ్యవధిలోనే బంగారం ధరలు ఏకంగా రూ.11 వేల వరకు పెరిగిందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. వరుసగా పసిడి ధరలు పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడిపోతున్నారు.  అసలే పెళ్లిళ్ల సీజన్.. పసిడి ధరలు ఆకాశాన్నంటిపోతున్న సమయంలో ఇప్పుడు కాస్త ఊరటనివ్వడంతో కొనుగోలుదారులు బంగారం షాపులకు క్యూ కడుతున్నారు. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఈ నెల జనవరి, ఫిబ్రవరి పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా.. మార్చి నెల నుంచి చుక్కలు చూపిస్తూ వస్తుంది. అల్ టైమ్ రికార్డు ధరలు నమోదు అవుతూ వస్తున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న పసిడి, వెండి ధరలు చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తి పోయారు. అలాంటిది రెండు రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెల్ లో మేలిమి 24 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.330 తగ్గి రూ.73,800 పలికింది. 22 క్యారెట్ 10 గ్రాములు ధర రూ.300 తగ్గి రూ.67,650 వద్ద ట్రెండ్ అవుతుంది. వరంగల్, విశాఖపట్నం, విజయవాడలో ఇదే ధర ట్రెండ్ అవుతుంది. మంగళవారం 24 క్యారెట్ బంగారం ధర తొలిసారి రూ.74 వేల మార్క్ దాటి రూ.74,130 పలికింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.86,900 గా వద్ద ట్రెండ్ అవుతుంది.

today gold rates

ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.250 తగ్గింది. 24 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.73,940 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67,790 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,640 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.73,790 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,550 వద్ద కొనసాగుతుంది.ఢిల్లీలో కిలో వెండి రూ.100కు తగ్గి ప్రస్తుతం రూ.86,400 గా వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, కోల్ కతా లో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,100 కు చేరిది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.