iDreamPost
android-app
ios-app

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

  • Published Mar 15, 2024 | 7:52 AM Updated Updated Mar 15, 2024 | 7:52 AM

Gold and Silver Rates: గత రెండు నెలలు పసిడి ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా.. మార్చి నెల నుంచి బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి.

Gold and Silver Rates: గత రెండు నెలలు పసిడి ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా.. మార్చి నెల నుంచి బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. గత ఏడాది చివర్లో పసిడి, వెండి ధరలు చుక్కలు చూపించాయి. జనవరి, ఫిబ్రవరి మాసంలో ధరలు కాస్త పరవాలేదు అనిపించినా.. మార్చి నాటికి మళ్లీ బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. గత కొన్నిరోజులుగా బంగారం ధర అస్సలు తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల వల్ల పసిడి, వెండి ధరల్లో మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లలో బారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. వేసవి కాలం కనుక పెళ్లిళ్లు ఇతర శుభకార్యక్రమాలు జరుపుతుంటారు. దీంతో మహిళలు పసిడి కొనుగోలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలంటే ధరలు చూస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత పది రోజులకు పైగా బంగారం ధరలు అస్సలు తగ్గకుండా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాల ప్రభావం బంగారం ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,610 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,120 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.80,100 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,270 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,610 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,120 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.74,400, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.77,100 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 78,500లు ఉండగా, ఢిల్లీ లో రూ.77,100 వద్ద ట్రెండ్ అవుతుంది.