భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

మహిళలకు గొప్ప శుభవార్త.. వారం రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం భారీగా క్షీణించింది. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు

మహిళలకు గొప్ప శుభవార్త.. వారం రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం భారీగా క్షీణించింది. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు

గత ఏడాది పసిడి.. కొనుగోలుదారులకు చుక్కలు చూపించినా.. ఈ ఏడాది మాత్రం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారం రోజులగా వరుసగా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం రూ.63 వేలకు చేరింది. గత పదిహేను రోజుల నుంచి పసిడి ధర ఒక్కసారే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చే మార్పుల కారణంగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.  బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయంల అని నిపుణులు చెబుతున్నారు. రాబోయేది ఎండాకాలం.. పెళ్లిళ్ల సీజన్, పసిడి ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మార్కెట్ లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో బంగారం వినియోగం భారీగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టు పసిడికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. బంగారం ధరలు కొంత కాలంగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తుంది. మహిళలకు గొప్ప శుభవార్త.. బుధవారం నాటికి పసిడి ధరలు భారీగా క్షీణించాయి.  వరుసగా బంగారం తగ్గుతూ వస్తుంది. పసిడి ధరలు తగ్గడంతో జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు మహిళలు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,990లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,170 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 75,400వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,140 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62,300 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.56,990లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 62,170 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ. 62,720వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,900 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.73,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.72,950 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments