P Krishna
Gold and Silver Rates:దేశలో నిత్యం పసిడి, వెండి ధరల్లో స్వల్ప మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నెల మొదటి రెండు రోజులు ధరలు పెరిగినా.. నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.
Gold and Silver Rates:దేశలో నిత్యం పసిడి, వెండి ధరల్లో స్వల్ప మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నెల మొదటి రెండు రోజులు ధరలు పెరిగినా.. నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.
P Krishna
ఇటీవల దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం అంటే మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బాగా ఇష్టపడుతుంటారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో పసిడికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయంగా మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల ప్రభావం బంగారం, వెండిపై పడటంతో తరుచూ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. జనవరి నెలలో పసిడి, వెండి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. నెల చివర్లో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఆదివారం స్వల్పంగా తగ్గిన ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయంటే..
అతివలకు గుడ్ న్యూస్.. ఆదివారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత ఏడాది చివర్లో పసిడి, వెండి ధరలు చుక్కలు చూపించాయి. వరుసగా ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. కొత్త ఏడాది ప్రారంభంలో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూకడుతున్నారు. బంగారం కేవలం అలంకరణ మాత్రమే కాదు.. సొసైటీలో గౌరవం, భద్రత అంటారు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగినపుడే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.58,100 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,380 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 77,000 వద్ద ట్రెండ్ వుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డు రేటు రూ.58,250లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,530 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,100లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380 వద్ద కొనసాగుతుంది. కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,100 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 63,380వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.63,380 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.77,000లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.76,500, బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 75,500 వద్ద ట్రెండ్ అవుతుంది.