iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

ఇటీవల పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. గత ఏడాది చివర్లో బంగారం ధరలు చుక్కలు చూపించాయి..ప్రస్తుతం కాస్త ఊరటనిస్తున్నాయి.

ఇటీవల పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. గత ఏడాది చివర్లో బంగారం ధరలు చుక్కలు చూపించాయి..ప్రస్తుతం కాస్త ఊరటనిస్తున్నాయి.

మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

భారత దేశంలో గత కొంత కాలంగా పసిడి ధరలు పెరిగపోతూ కొనుగోలుదారులను కంగారుపెట్టిస్తున్నాయి. పండుగలు, పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు తరుచూ ధరలు పెరగడం, తగ్గడంతో కన్ఫ్యూజ్ లో పడుతున్నారు. గత వారం రోజులు వరుసగా పెరిగిన బంగారం ధలు మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప ఊరట లభించింది. నిన్నటితో పోల్చుకుంటే పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసే పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.. ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. మార్కెట్ లో నేడు పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు బంగారం. ప్రపంచ దేశాల్లో ఆడ, మగ ఎవరైనా ఎంతో ఇష్టపడుతుంటారు.. అందుకే దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో ఏ చిన్న శుభకార్యాలైనా మహిళలు పసిడి కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు తరుచూ తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. ఏది ఏమైనా గత నాలుగైదు రోజులుగా పసిడి స్వల ఊరటనిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57, 750 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 63, 000 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ. 76,800 వద్ద ట్రెండ్ వుతుంది.

today gold rates

ఇక దేశంలోని ప్రధాన నగరాలు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,200 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,750 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతుంది. కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,750 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.63,430 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.76,600 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో 75,300, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 74,800, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,100 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి