P Krishna
ఇటీవల పసడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన మార్పులు వల్ల ఎప్పుడు పెరుగుతాయో.. తగ్గుతాయో తెలియని పరిస్తితి. కానీ మార్కెట్ లో మాత్రం పసిడికి విపరీతమై డిమాండ్ కొనసాగుతుంది.
ఇటీవల పసడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన మార్పులు వల్ల ఎప్పుడు పెరుగుతాయో.. తగ్గుతాయో తెలియని పరిస్తితి. కానీ మార్కెట్ లో మాత్రం పసిడికి విపరీతమై డిమాండ్ కొనసాగుతుంది.
P Krishna
దేశంలో బంగారం అంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పండుగలు, శుభకార్యాలు, ఇతన సెలబ్రెషన్స్ కి బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. కొంతకాలంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన మార్పుల ప్రభావం బంగారంపై పడుతుంది. గత నెలలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అప్పుడప్పుడు స్థిరంగా ఉన్నా.. ఇటీవల వరుసగా ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. గతనెలలో గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది.. తాజాగా ఈ రోజు ఒక్కసారే తగ్గాయి. వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..
పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ మధ్య గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నా.. కోనుగోలు ఏమాత్రం తగ్గడం లేదు. నిన్నటి వరకు చుక్కలు చూపించిన పసిడి ధర నేడు కాస్త తగ్గుముఖం పట్టింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వస్తున్న మార్పుల వల్ల నేడు స్వల్పంగా ఊరట లభించింది. దీని ప్రభావం పసిడి ధరల పై పడింది. నిన్నటిలో పోల్చుకుంటే పసిడి ధర బాగానే తగ్గింది. నేడు దేశీయ మార్కెట్ లో పసడి ధరల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 62,760 వద్ద కొనసాగుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,710 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,730 వద్ద కొనసాగుతుంది. కోల్కొతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,350 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,760 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,980 వద్ద ట్రెండ్ అవుతుంది. బెంగుళూర్ లో 22 క్యారెట్ల పసిడి రేటు రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల పసిడి రేటు రూ.62,560 గా వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.82,200 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో సిల్వర్ రేటు కిలో రూ.రూ.79,200 గా ఉంది. ముంబైలో వెండి ధర కిలో రూ.79,500, చెన్నైలో వెండి ధర కిలో రూ.82,200, బెంగుళూరులో రూ.79,250 వద్ద కొనసాగుతుంది.