iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

  • Published Nov 01, 2023 | 9:03 AM Updated Updated Nov 01, 2023 | 9:03 AM

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో..ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఏకంగా మూడు వేల వరకు బంగారం ధరలు పెరిగిపోయాయి.

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో..ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఏకంగా మూడు వేల వరకు బంగారం ధరలు పెరిగిపోయాయి.

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా మహిళలు ఏ శుభకార్యాలు జరిగినా.. పండుగు, వివాహవేడుకలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. గత నెలలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో కోనుగోలుదారులు నిరాశపడ్డారు. అయితే కొంతకాలంగా బంగారం ధరలు తరుచూ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్య ఇజ్రాయెల్-పాలస్తినాల మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా బంగారం ధరలపై ఎఫెక్ట్ పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనుగోలు చేసేవారికి గొప్ప శుభవార్త.. రెండు రోజులుగా వరుసగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. మన దేశంలో పండుగలు, పెళ్లిళ్లకు బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. సెప్టెంబర్ లో బంగారం ధరలు వరుసగా తగ్గి వస్తే.. అక్టోబర్ లో మాత్రం చుక్కలు చూపించాయి. 24 క్యారెట్ బంగారం తులం 63 వేల వరకు చేరింది. తాజాగా పసిడి రేటు తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.550 తగ్గింది, 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.500 వరకు తగ్గింది. ఇక వెండి ధర కూడా ఈ రోజు తగ్గింది. కిలో వెండిపై రూ.300 వరకు తగ్గింది. నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56, 700 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,850 వద్ద కొనసాగుతుంది.

ఇక దేశంలోని పెద్ద నగరాలు అయిన ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,850 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 62,000 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,150 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,350 వద్ద ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 78,200 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,300 వద్ద కొనసాగుతుంది. చెన్నై లో నేడు కిలో వెండి ధర. 78,200 వద్ద ట్రెండ్ అవుతుంది. దీపావళి, పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా బంగారం తగ్గినపుడు కొంటే చాలా మంచిదని.. ఇదే మంచి అవకాశం అని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.