iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే!

  • Published Oct 26, 2023 | 9:15 AM Updated Updated Oct 26, 2023 | 9:15 AM

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. కానీ బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. కానీ బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే!

గత కొద్ది కాలంగా భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తరుచూ మారిపోతున్నాయి. గత నెల వరుసగా దిగివచ్చిన పసిడి ధరలు ఈ నెల చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ పెరిగిపోతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చేసేవారికి మళ్లీ బ్యాడ్ న్యూస్. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో గురువారం పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న రూ.200 వరకు పెరిగిన థరలు ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 100 పెరిగింది, 24 క్యారెట్ల పసిడి పై రూ. 110 పెరిగింది. కాకపోతే వెండి ధర మాత్రం తగ్గింది. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారం అంటే భారత దేశంలో ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా మహిళలలు పండుగలు.. తమ ఇంట జరిగే శుభకార్యాలకు ఎంతో కొంత బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే కొద్ది కాలంగా బంగారం ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. కొంతకాలంగా బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. గత నెల ఏకంగా మూడు వేల వరకు తగ్గిన బంగారం ఇప్పుడు మూడు వేలకు పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడం మంచిదే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800 వద్ద కొనసాగుతుంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేట్ రూ. 61,950 వద్ద ట్రెండ్ అవుతుంది. బెంగుళూరు, కోల్‌కొతా, ముంబాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల పై రూ.200 తగ్గి ప్రస్తుతం రూ. 56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పై రూ.220 తగ్గి ప్రస్తుతం తులం రూ. 61,690 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్ కొతా లాంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి రూ.75,500 వద్ద ట్రెండ్ అవుతుంది.