iDreamPost
android-app
ios-app

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఏంతంటే?

  • Published Oct 25, 2023 | 9:54 AM Updated Updated Oct 25, 2023 | 10:01 AM

బంగారం, వెండి ధరలకు గత కొన్నిరోజులుగా రెక్కలు వచ్చాయి. ప్రతిరోజూ ఎంతో అంత ధర పెరిగిపోతూ వస్తుంది. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ప్రియులకు ఈ ధరలు షాకింగ్ గా ఉన్నాయి.

బంగారం, వెండి ధరలకు గత కొన్నిరోజులుగా రెక్కలు వచ్చాయి. ప్రతిరోజూ ఎంతో అంత ధర పెరిగిపోతూ వస్తుంది. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ప్రియులకు ఈ ధరలు షాకింగ్ గా ఉన్నాయి.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఏంతంటే?

దేశంలో బంగారం అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. గత నెల వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగిపోతూ షాక్ ఇస్తుంది. ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీన మధ్య యుద్దం కారణంగా మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడి బంగారంపై ప్రభావం చూపిస్తుందని.. అందుకే బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతూ వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దసరా తర్వాత దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం పెరగడం ఒకింత ఇబ్బందిగా ఉన్నా.. మహిళలు ఆభరణాలు కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతూనే ఉన్నారు. నేడు బుధవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశంలో రోజు రోజుకీ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కొన్నిరోజులు స్థిరంగా ఉండి.. తగ్గుముఖం పట్టిన పసిడి ఈ నెల మాత్రం చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా పండుగల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరిగిపోవడం మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నేడు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల పసిడి రూ.60 వేలకు పైగా ట్రెండ్ అవుతుంది. భవిష్యత్ లో పసిడి, వెండి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయదలిచిన వారు ఇప్పుడు కొంటే బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేడు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.200 పెరిగింది, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.240 వరకు పెరిగింది. వెండి రేటు మాత్రం కాస్త తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ. 56,550 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాములపసిడి ధర రూ. 61,690 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఇక దేశంలోని ముఖ్య నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 56,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేట్ రూ. 61,840 వద్ద కొనసాగుతుంది. ఇక ముంబాయి, బెంగుళూరు, కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.61,690 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములగోల్డ్ రేట్ రూ. 56,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ రేట్ రూ. 61,910 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. రెండు రోజుల నుంచి వెండి 700 రూపాయల వరకు తగ్గింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, వరంగల్ లో కిలో వెండి రూ. 78,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ. 74,600 వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి రూ. 78,000 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 74, 000 వద్ద కొనసాగుతుంది.