P Krishna
దేశంలో ప్రతిరోజూ పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వస్తే మహిళలు బంగారం కొనుగోలు కోసం జ్యులరీ షాపులకు ఎగబడుతుంటారు.
దేశంలో ప్రతిరోజూ పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వస్తే మహిళలు బంగారం కొనుగోలు కోసం జ్యులరీ షాపులకు ఎగబడుతుంటారు.
P Krishna
దేశంలో బంగారం అంటే మహిళలు ఎంతో ఇష్టపడతారు. అందుకే ఇక్కడ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇటీవల బంగారం ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. గత నెల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ నెలలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ఓ వైపు మహిళలు అభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటే.. మరోవైపు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దసరా పండుగ రోజు పసిడి ప్రియులకు శుభవార్త.. వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..
ఇటీవల దేశంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకటీ రెండు సార్లు స్థిరంగా కొనసాగినా.. ప్రతిరోజూ అంతో ఇంతో పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. విజయదశమి సందర్భంగా బంగారం కాస్త తగ్గుముఖం పట్టడంతో మహిళలు సంతోషంలో ఉన్నారు. మార్కెట్ లో నిన్నటితో పోల్చుకుంటే సోమవారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేల మార్క్ దాటి ట్రెండింగ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు చేస్తే బెటర్ అంటున్నారు. భవిష్యత్ లో బంగారం మరింత ప్రియం కావొచ్చు అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్దం కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో బంగారం ధరలపై విపరీతమైన ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్, విజయవాడ,వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,750 వద్ద కొనసాగుతుంది. దేశంలోని మహానగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిధర రూ. 61,900 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగళూరు, కేరళలో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాములబంగారం ధర రూ. 61,750 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిధర రూ. 61,850 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే వెండిలో కూడా ఏ మార్పు లేదు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర 78,700 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ. 75,300 గా ఉండగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,500 వద్ద ట్రెండ్ అవుతుంది.