P Krishna
Gold and Silver Rates: ఇటీవల దేశంలో బంగారం, వెండి ధరలు తరుచూ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు దిగివస్తున్నాయి. ఇలాంటి సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Gold and Silver Rates: ఇటీవల దేశంలో బంగారం, వెండి ధరలు తరుచూ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు దిగివస్తున్నాయి. ఇలాంటి సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
P Krishna
భారతీయ మహిళలు పసిడి అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఎంతో విలువైన లోహం పసిడి. ఇటీవల బంగారం ఆభరణాలుగానే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ గా ఉపయోగిస్తున్నారు. ఏ క్లిష్ట సమయంలో అయినా పసిడి ఉపయోగపడుతుందని మిడిల్ క్లాస్ వర్గాలు భావిస్తున్నారు. దీంతో రోజు రోజుకి గోల్డ్ కి మరింత డిమాండ్ పెరిగిపోతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాల ప్రభావం పసిడి పై పడి ధరల్లో మార్పులు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఆషాఢ మాసం సందడి మొదలైంది.. ఇక పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఇంట జరిపిస్తుంటారు. మహిళలకు జ్యుయలరీ షాపులకు క్యూ కడుతుంటారు. కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. అయితే దీని డిమాండ్ ఎక్కడ తగ్గడం లేదు. సోమవారం (జులై 15) నాటికి 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.67,590 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.73,740 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,740 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,890 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,230 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,740 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.95,400 వద్ద కొనసాతుంది.