P Krishna
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. గత నెలలో వరుసగా దిగివచ్చిన బంగారం ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతిరోజూ భారీగా ధరలు పెరిగిపోతున్నాయి.
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. గత నెలలో వరుసగా దిగివచ్చిన బంగారం ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతిరోజూ భారీగా ధరలు పెరిగిపోతున్నాయి.
P Krishna
భారత దేశంలో మహిళలు ఎంతో ఇష్టపడే బంగారం గత పదిరోజుల నుంచి చుక్కలు చూపిస్తుంది. ఒకటీ రెండు రోజుల మినహా ప్రతిరోజూ పెరిగిపోతూ వస్తుంది. గత నెల వరుసగా దిగివచ్చిన పసిడి ధరలు పది రోజుల నుంచి అమాంతం పెరిగిపోతూ వస్తున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య యుద్దం మొదలైన్నప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడటంతో పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ వస్తుంది.. ఈ సమయంలోనే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో భవిష్యత్ లో తగ్గుతాయా..? లేదా మరింత పెరుగుతాయా? ఆలోచనలో మహిళలు బంగారు కొనుగోలు విషయంలో ఆలోచనలో పడ్డారు. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. విజయదశమి రోజు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు.. విజయదశమి రోజు బంగారం కొంటే అన్నీ శుభాలు జరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారు ఆభరణాలు కొనేందుకు జ్యూలరీ షాపులకు క్యూ కడుతుంటారు. గత నెలలో బంగారం ధరలు భారీగా తగ్గినా.. ఇప్పుడు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. నేడు పసిడి ఒక్కసారే 700 రూపాలకు పైగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,530 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. ప్రస్తుతం కెజీ వెండి ధర రూ.74,100 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢీల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,690 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్ రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్ రూ.61,530 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో ప్రస్తుతం మార్కెట్ లో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ రూ.56,600 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.61,750 వద్ద ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రెండ్ అవుతుంది. భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి కోసం పసిడికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ప్రతిరోజూ దీని ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలకు ధరలు షాక్ ఇస్తున్నాయి.