iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు ఊరట.. నేడు బంగారం, వెండి ధర ఎంత ఉందంటే

  • Published Sep 21, 2023 | 8:00 AM Updated Updated Sep 21, 2023 | 8:00 AM
  • Published Sep 21, 2023 | 8:00 AMUpdated Sep 21, 2023 | 8:00 AM
పసిడి ప్రియులకు ఊరట.. నేడు బంగారం, వెండి ధర ఎంత ఉందంటే

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీ షాక్‌ ఇస్తున్నాయి. క్రితం సెషషన్‌లో గోల్డ్ ధర భారీగా పెరుగుతూ పోయింది. అసలే పండగలు, పెళ్లిల్ల సీజన్‌ ప్రారంభం అయ్యింది. దాంతో బంగారానికి డిమాండ్‌ భారీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ధర పెరగడం అనేది సామాన్యులకు షాకింగ్‌ అనే చెప్పవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. ఆ ప్రభావం దేశీయ బులియన్‌ మార్కెట్‌ మీద కూడా ఉంది. దాంతో మన దగ్గర బంగారం ధర పరుగులు తీస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న బంగారం ధరకు నేడు బ్రేక్‌ పడింది. గురువారం బంగారం ధర స్థిరంగా కొనసాగింది. మరి నేడు ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధర ఎలా ఉంది అంటే..

హైదరాబాద్ మార్కెట్‌లో క్రితం సెషన్‌లో బంగారం ధర భారీగా పెరగ్గా.. నేడు మాత్రం స్థిరంగా కొనసాగింది. గురువారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 55,200 వద్ద స్థిరంగా ఉంది. అయితే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర మాత్రం అతి స్వల్పంగా.. 10 గ్రాముల మీద 10 రూపాయలు పెరిగింది. ఇక భాగ్యనగరంలో 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 60,230 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 22 క్యారెట్‌ గోల్డ్ పది గ్రాముల రేటు స్థిరంగా ఉంది.. రూ. 55,350 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 60,370 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

భారీగా దిగి వచ్చిన సిల్వర్‌ ధర

నేడు బంగారం ధర స్థిరంగా ఉండగా వెండి రేటు మాత్రం దిగివచ్చింది. ప్రస్తుతం మన హైదరాబాద్‌లో వెండి ధర కిలో మీద రూ.300 తగ్గింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో సిల్వర్ రేటు రూ.78 వేల మార్క్ వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో సైతం వెండి ధర దిగి వచ్చింది. కిలో వెండి రేటు రూ. 300 తగ్గి ప్రస్తుతం రూ. 74,500ల వద్ద ట్రేడవుతోంది.