iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు అలర్ట్‌.. దిగి వచ్చిన బంగారం ధర

  • Published Sep 12, 2023 | 8:07 AMUpdated Sep 12, 2023 | 8:07 AM
  • Published Sep 12, 2023 | 8:07 AMUpdated Sep 12, 2023 | 8:07 AM
పసిడి ప్రియులకు అలర్ట్‌.. దిగి వచ్చిన బంగారం ధర

బంగారం అంటే భారతీయులకు కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. అక్కరకు వచ్చే పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఒంటి మీద బంగారం ఉంటే చాలు.. ఆపద గట్టెక్కవచ్చని భావిస్తారు. అందుకే సందర్భం దొరికిన ప్రతి సారి బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు. పండగలు, వివాహాది శుభకార్యాల సందర్భంగా కచ్చితంగా బంగారం కొంటారు. ఇక ఆగస్ట్‌ నెల ఆరంభం నుంచి తగ్గిన పసిడి ధర.. శ్రావణ మాసం ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. నేడు స్వల్పంగా తగ్గింది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత తగ్గింది.. పది గ్రాముల ధర ఎంత ఉంది అంటే..

సోమవారం (సెప్టెంబర్‌11)తో పోల్చితే నేడు అనగా మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి.. రూ.54,840గా వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద పది రూపాయలు తగ్గి.. ప్రస్తుతం రూ.59,830 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం నేడు బంగారం ధర స్పల్పంగా దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల మీద 10 రూపాయలు తగ్గి.. రూ.54,990గా ఉండగా.. 24 క్యారెట్‌ పసిడి ధర రూ.59,990గా ఉంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు బంగారం ధర స్వల్పంగా దిగి రాగా.. వెండి ధర మాత్రం.. భారీగా పెరిగింది. నేడు కిలో వెండి మీద 500 రూపాయలు పెరిగింది. ఇక మంగళవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000 గా ఉంది. హైదరాబాద్‌లో ​ఇలొ వెండి రేటు రూ. 77,500లుగా ట్రెండ్‌ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి