iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంతుందంటే

  • Published Nov 06, 2023 | 8:59 AMUpdated Nov 06, 2023 | 8:59 AM

బంగారం, వెండి ధరలు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు లోహాల ధర గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. మరి నేడు గోల్డ్‌, సిల్వర్‌ ధర ఎంత ఉందంటే..

బంగారం, వెండి ధరలు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు లోహాల ధర గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. మరి నేడు గోల్డ్‌, సిల్వర్‌ ధర ఎంత ఉందంటే..

  • Published Nov 06, 2023 | 8:59 AMUpdated Nov 06, 2023 | 8:59 AM
పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంతుందంటే

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దృష్టిలో బంగారం అంటే కేవలం విలువైన ఆభరణం మాత్రమే కాక.. లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఆర్థికంగా వస్తే.. బంగారానికి మించిన పెట్టుబడి సాధనం వేరే ఉండదు. పదేళ్లతో పోలిస్తే.. పసిడి ధర ప్రస్తుతం రెండు, మూడు రెట్లు పెరిగింది. ఇక భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది తప్ప.. గోల్డ్‌ రేటు దిగి రాదు. ఇక గత మూడు నాలుగు రోజుల నుంచి బంగారం ధర.. ఒక రోజు పెరగడం.. మరోరోజు దిగి రావడం చేస్తోంది. ఇక ఆదివారం బంగారం ధర స్వల్పంగా దిగి రాగా.. నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

నేడు అనగా సోమవారం నాడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్‌ గోల్ట్‌ రేటు ధర రూ. 56,500 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం మాత్రం ఇది 10 గ్రాముల మీద రూ. 100 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల రేటు రూ. 61,640 మార్కు వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్లోనూ నేడు పుత్తడి రేటు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల రేటు రూ. 56,650 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ ధర రూ. 61,790 వద్ద ట్రేడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి కూడా పుత్తడి బాటలోనే పయనిస్తోంది. నేడు ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర 75 వేల వద్ద ఉంది. ఆదివారం మాత్రం వెండి ధర కిలో మీద ఏకంగా రూ. 900 మేర పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 78 వేల మార్కు వద్ద ఉంది. ఇక ఇంటర్నేషనల్ బులియన్‌ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. నేడు గ్లోబల్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1990 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 23.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి