iDreamPost

Gold & Silver Rate: దిగి రానంటున్న పసిడి రేటు.. లక్ష దిశగా వెండి పరుగు

  • Published Jun 17, 2024 | 7:54 AMUpdated Jun 17, 2024 | 7:54 AM

బంగారం కొనాలనుకుంటున్నారా... అయితే మీకు ఇది తీవ్రంగా నిరాశ కలిగించే వార్త అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు నేడు ఏమాత్రం తగ్గలేదు. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకుంటున్నారా... అయితే మీకు ఇది తీవ్రంగా నిరాశ కలిగించే వార్త అని చెప్పవచ్చు. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు నేడు ఏమాత్రం తగ్గలేదు. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 7:54 AMUpdated Jun 17, 2024 | 7:54 AM
Gold & Silver Rate: దిగి రానంటున్న పసిడి రేటు.. లక్ష దిశగా వెండి పరుగు

బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలో ఎంత చిన్న మొత్తం ఉన్నా సరే.. గోల్డ్‌ కొనాలని భావిస్తారు. బంగారం అంటే ఇండియన్స్‌ దృష్టిలో ఖరీదైన లోహం, ఆభరణం మాత్రమే కాక.. దేవతగా పూజిస్తారు. పైగా అక్కరకు ఆదుకునే నేస్తం కూడా కావడంతో.. చాలా మంది ప్రతి చిన్న సందర్భానికి పసిడి కొంటుంటారు. అయితే గత కొన్నాళ్లుగా బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ ఏడాది గోల్డ్‌ రేటు గరిష్టాలకు చేరింది. పది గ్రాముల ధర ఏకంగా 75వేల రూపాయలకు చేరింది. గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధర.. క్రితం వారం రోజులుగా దిగి వస్తోంది. కొన్ని రోజులు పెరగడం.. ఓ రెండు రోజులు దిగి రావడం చేస్తోంది. ఇక ​క్రితం సెషన్‌లో పది గ్రాముల బంగారం ధర 600 రూపాయల మేర పెరిగి.. షాకిచ్చింది. నేడు అనగా సోమవారం నాడు మాత్రం చాలా స్వల్పంగా దిగి వచ్చింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

హైదరాబాద్‌ మార్కెట్‌లో క్రితం సెషన్‌లో అనగా ఆదివారం నాడు బంగారం ధర పది గ్రాముల మీద 600 రూపాయలు పెరగ్గా.. నేడు అనగా సోమవారం నాడు మాత్రం అత్యంత స్వల్పంగా కేవలం రూ.10 మాత్రమే దిగి వచ్చింది. నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర పది రూపాయల మేర దిగి వచ్చింది. నేడు నగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర 66,490 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా పది గ్రాముల మీద కేవలం 10 రూపాయలు దిగి వచ్చింది. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు 72,540 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద 10 రూపాయలు తగ్గింది. ఇక నేడు ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్‌ పసిడి రేటు 66,640 రూపాయలుగా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద 10 రూపాయలు తగ్గి.. రూ.72,690గా కొనసాగుతోంది.

లక్షకు చేరువలో వెండి రేటు..

నేడు వెండి రేటు కూడా బంగారం బాటలోనే పయనించింది. క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద 500 రూపాయలు పెరగ్గా.. నేడు అనగా సోమవారం నాడు మాత్రం కిలో మీద 100 రూపాయలు తగ్గింది. క్రితం సెషన్‌లో హైదరాబాద్‌లో కిలో వెడి రేటు 500 పెరిగి రూ. 95,600కి చేరగా.. నేడు వంద రూపాయలు తగ్గి.. 95,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలానే ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు కిలో మీద కేవలం వంద రూపాయలు తగ్గింది. నేడు ఢిల్లీలో వెండి ధర కిలో మీద 100 రూపాయలు తగ్గి.. 90,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి