మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతోొ పసిడి కొనుగోలు శాతం రోజు రోజుకీ పెరిగిపోతుంది.

దేశంలో బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతోొ పసిడి కొనుగోలు శాతం రోజు రోజుకీ పెరిగిపోతుంది.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల ప్రభావం బంగారం, వెండిపై పడుతుంది. గత రెండు నెలల నుంచి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ.. ఈ వారం గోల్డ్ రెండు మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. మంగళవారం మరోసారి బంగారం ధరలు తగ్గాయి. మహిళలు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశం అని అంటున్నాను నిపుణులు. నేడు మార్కెట్ లో తులం పసిడి ధర రూ.220 మేర తగ్గింది. వెండి సైతం రూ.200 మేర తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. ఈ టైమ్ లో పసిడి ధరలు తగ్గడంతో బంగారం కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. నేడు మార్కెట్ లో వెండి, బంగారం ధరల ఎంతంటే.

ఈ వారం మొదట పసిడి ధరలు పెరిగాయి.. కానీ ఆదివారం నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి..అంతేకాదు మంగళవారం మరింత తగ్గి పసిడి ప్రియులకు శుభవార్తను అందించాయి. ఇటీవల ద్రవ్యోల్భణంతో పాటుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వస్తున్న మార్పులు బంగారం ధరలపై పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 56,950 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,130 వద్ద ట్రెండ్ అవుతుంది. నేడు మార్కెట్ లో సిల్వర్ రేట్ కూడా రూ.200 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,800 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,050 వద్ద ఉండగా. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,280 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, కోల్‌కొతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 56,950 వద్ద ఉండగా. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ. 57,500వద్ద ఉండగా. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,730 వద్ద కొనసాగుతుంది. ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ. 75,800 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,800 వద్ద కొనసాగుతుంది.

Show comments