iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వస్తోన్న ధర

  • Published Aug 29, 2023 | 7:56 AMUpdated Aug 29, 2023 | 9:06 AM
  • Published Aug 29, 2023 | 7:56 AMUpdated Aug 29, 2023 | 9:06 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వస్తోన్న ధర

ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి దిగి వచ్చిన బంగారం ధర.. శ్రావణ మాసం ప్రారంభం నాటి నుంచి గోల్డ్‌ రేటు పెరుగుతోంది. అయితే ఇటీవల వరుసగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. గత మూడు రోజులుగా దిగి వస్తోన్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో.. అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌తో పాటు.. దేశీయంగా కూడా గోల్డ్‌ రేటు దిగి వస్తోంది. ఇక నేడు కూడా బంగారం ధర దిగి వచ్చింది. మరి హైదరాబాద్‌, ఢిల్లీలో గోల్డ్‌, సిల్వర్‌ రేటు ఎంత దిగి వచ్చింది అంటే..

ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర.. నేడు స్వల్పంగా తగ్గింది. ఇక హైదరాబాద్‌లో మంగళవారం ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర 10 గ్రాముల మీద 50 రూపాయలు దిగి వచ్చింది. దాంతో నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల ధర రూ. 54, 450 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా నేడు స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.50  తగ్గి.. 59,400 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ 10 గ్రాముల ధర 54,600 రూపాయల వద్ద ట్రేడవుతుంది. ఇక 24 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి ధర 59,550 వద్ద కొనసాగుతోంది.

స్థిరంగా వెండి ధర..

నేడు బంగారం ధర దిగి రాగా.. వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర.. 80 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో నేడు కిలో వెండి ధర రూ.76,900 వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి