iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర

  • Published Aug 16, 2023 | 8:00 AM Updated Updated Aug 16, 2023 | 8:00 AM
  • Published Aug 16, 2023 | 8:00 AMUpdated Aug 16, 2023 | 8:00 AM
పసిడి ప్రియులకు భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర

ఈ భూమ్మీద ఉన్న ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. తరాలు గడిచినా.. వన్నె తగ్గని గుణం దీని సొంతం. ఇంత అరుదైన గుణాలు ఉన్నాయి కాబట్టే.. ధర కూడా భారీగా ఉంటుంది. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటికే రెండు సార్లు గరిష్ట స్థాయిలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్ట్‌ ప్రారంభం నుంచి బంగారం ధర మాత్రం భారీగా దిగి వస్తోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో.. బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో గోల్డ్‌ రేటు దిగి రావడం మంచి పరిణామం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇక గత కొన్ని రోజులుగా దిగి వచ్చిన బంగారం ధర నేడు కూడా తగ్గింది. బుధవారం ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత దిగి వచ్చింది అంటే..

ఇక బుధవారం బంగారం ధర దిగి వచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర 100 రూపాయలు తగ్గి.. రూ.54,550 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 110 రూపాయలు తగ్గి.. రూ.59,510 వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద 100 రూపాయలు తగ్గి.. రూ.54,700 లుగా ఉంది. అలానే 24 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద 110 రూపాయలు తగ్గి.. రూ.59,660 గా ఉంది.

స్థిరంగా వెండి ధర..

నేడు బంగారం ధర దిగి రాగా.. వెండి రేటు మాత్రం అలానే ఉంది. ఇక నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800 లుగా కొనసాగుతోంది. అలానే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు నేటి బులియన్ మార్కెట్ వెబ్‌సైట్స్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.