Dharani
Gold, Silver Rate On Aug 12th: క్రితం రెండు సెషన్లలో భారీగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం ఊరట కలిగించింది. ఆ వివరాలు..
Gold, Silver Rate On Aug 12th: క్రితం రెండు సెషన్లలో భారీగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం ఊరట కలిగించింది. ఆ వివరాలు..
Dharani
శ్రావణమాసం మొదలయ్యింది. దాంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పైగా రేటు దిగి రావడంతో.. చాలా మంది పుత్తడి కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి పసిడి ధర భారీగా పడిపోతూ వస్తూంది. పది గ్రాముల మీద ఏకంగా 7 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. గత కొన్ని రోజులుగా వరుసగా దిగి వచ్చిన పుత్తడి ధర.. క్రితం రెండు సెషన్లలో మాత్రం ఊహించని రీతిలో పెరిగింది. దాంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేటి గోల్డ్ రేటు పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తోంది. మరీ నేడు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆగస్ట్ 9, 10న భారీగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆభరణాల తయారీకి వినియోగించే బంగారం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. అనగా పది గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 64,450 వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. ఇదే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటులో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి పది గ్రాముల ధర రూ. 70,310 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఇక నేడు హస్తినలో కూడా పసిడి రేటు స్థిరంగా ఉంది. ఇవాళ ఢిల్లీలో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల రేటు రూ. 64,600 వద్ద ఉంది. అలానే ఇక 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 70,460 వద్ద ఉంది.
నేడు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది. అనగా సిల్వర్ రేటు కూడా స్థిరంగా కొనసాగింది. క్రితం సెషన్లలో వెండి రేటు భారీగా పెరిగింది. ఇవాళ ఢిల్లీలో కేజీ వెండి రూ. 83 వేల వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. అంతకుముందు రెండు రోజుల్లో రూ. 1000, రూ. 1500 చొప్పున పెరిగింది. ఇదే హైదరాబాద్ నగరంలో చూసుకుంటే నేడు కేజీ సిల్వర్ ధర రూ. 88 వేల మార్కు వద్ద ఉంది.