iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన ధర!

  • Published Jul 20, 2023 | 8:36 AMUpdated Jul 20, 2023 | 8:36 AM
  • Published Jul 20, 2023 | 8:36 AMUpdated Jul 20, 2023 | 8:36 AM
బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన ధర!

బంగారం అంటే ఇష్టపడని భారతీయ మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక చాలా మంది ఆడవాళ్లు.. బంగారం మీద మక్కువతో.. సందర్భం దొరికి ప్రతి సారి ఎంతో కొంత పుత్తడి కొనుగోలు చేస్తారు. ఇదేమి దుబారా ఖర్చు కూడా కాదు. ఆడపిల్లలు ఉంటే వారికి భవిష్యత్తులో పెట్టడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సమయంలో చేతిలో రూపాయి లేనప్పుడు.. ఎవరిని అప్పు అడిగే పని లేకుండా.. మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి గండం నుంచి గట్టెక్కవచ్చు. మన దగ్గర బంగారానికి ఎంత డిమాండ్‌ ఉందో.. ఉత్పత్తి అంత తక్కువ. అందుకు పుత్తడి రేటు చుక్కలను తాకుతుంది. ఇక ఈ నెలలో బంగారం ధర కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా అస్థిరంగా ఉన్న కనకం రేటు.. నేడు రికార్డ్‌ స్థాయిలో పెరిగి.. బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్‌ ఇచ్చింది. మరి నేడు పుత్తడి ధర ఎంత పెరిగింది.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు రాజధాని భాగ్యనగరంలో బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల ధర రూ. 500 పెరిగి రూ.55,600 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా 10 గ్రాముల మీద రూ. 550 పెరిగి ప్రస్తుతం రూ.60,650 వద్ద ఉంది. ఇక క్రితం సెషన్‌లో కూడా గోల్డ్‌ రేటు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగానే పెరిగి షాకిచ్చింది. నేను హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.620 పెరిగి ప్రస్తుతం రూ.55,750 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగార రేటు 10 గ్రాముల మీద ఏకంగా 670 పెరిగి రూ.60,800 మార్కుకు చేరింది. సాధారణంగా బంగారం ధర హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో కాస్త ఎక్కువగాను.. వెండి ధర కాస్త తక్కువగాను ఉంటుంది. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి ఈ బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.

ఇక నేడు వెండి ధర విషయానికి వస్తే.. అది కూడా గోల్డ్‌ బాటలోనే పయనించి.. భారీగా పెరిగి షాకిచ్చింది. నేడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.600 ఎగబాకి.. ప్రస్తుతం రూ. 82 వేల మార్కు వద్ద ఉంది. అంతకుముందు రెండు రోజులు మాత్రం వెండి ధర దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వెండి ధర చుక్కలు చూపిస్తోంది. వరుసగా 10 రోజుల్లో ఒక్కరోజు కూడా తగ్గలేదు. ఈ పది రోజుల వ్యవధిలో కిలో వెండి ధర ఏకంగా 5 వేలు పెరగడం గమనార్హం. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 78,400 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో క కూడా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ధర ఔన్సుకు ప్రస్తుతం 1984 డాలర్లకు ఎగబాకడం గమనార్హం. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 25 డాలర్లపైన ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి