iDreamPost
android-app
ios-app

Today Gold Rates: గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయని ఆనందించే లోపే.. పసిడి ప్రియులకు షాక్!

  • Published Jun 12, 2024 | 7:57 AM Updated Updated Jun 12, 2024 | 7:57 AM

బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉండి.. పసిడి ప్రియులు ఆనందించే లోపే.. మళ్ళీ షాక్ ఇచ్చాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉండి.. పసిడి ప్రియులు ఆనందించే లోపే.. మళ్ళీ షాక్ ఇచ్చాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Published Jun 12, 2024 | 7:57 AMUpdated Jun 12, 2024 | 7:57 AM
Today Gold Rates: గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయని ఆనందించే లోపే.. పసిడి ప్రియులకు షాక్!

మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ.. పసిడి ప్రియులను ఆనందింపజేశాయి. బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్ అని అనుకునే లోపే.. మార్కెట్ లో నేటి బంగారం ధరలు కొనుగోలు దారులకు సడెన్ షాక్ ఇచ్చినట్లయింది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో.. ఎవరు ఊహించలేరు. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఈ క్రమంలో జూన్ 12 న మార్కెట్ లో గోల్డ్ , సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగిన కారణంగా.. దేశీయ మార్కెట్ పై ఈ ప్రభావం బాగా పడింది. ఇటు మన మార్కెట్ లోను ఈ ఎఫెక్ట్ కనపడుతుంది. గత రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. నాలుగు రోజుల క్రితం.. ఒక్కరోజే రూ.2000 మేర తగ్గినా బంగారం రేటు.. రెండు రోజుల పాటు అదే ధరకు కొనసాగింది. దీనితో బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్ అని అంతా భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్స్ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నిన్నటితో పోల్చితే.. దాదాపు 5 డాలర్ల వరకు రేట్ పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు.. ఔన్సుకు 2313 డాలర్స్ వద్ద కొనసాగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సుకు 29.25 డాలర్స్ వద్ద ట్రేడింగ్ అవుతుంది.

ఇక హైదరాబాద్ మార్కెట్ లో .. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 మేర పెరిగింది.. ప్రస్తుతం 65 వేల 850 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికొస్తే.. తులానికి రూ.170 పెరిగి రూ. 71 వేల 840 వద్ద కొనసాగుతుంది. ఇక ఢిల్లీ మార్కెట్ లో.. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 150 పెరిగి రూ.66 వేల వద్ద ట్రేడింగ్ అవుతుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ విషయానికొస్తే.. రూ.170 పెరిగి.. రూ. 71,990 వద్ద కొనసాగుతుంది. ఇక ఓ వైపు బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గి రూ. 95 వేల వద్దకు కొనసాగుతుంది. అలాగే ఢిల్లీ మార్కెట్ లో వెండి ధర రూ. 1200 మేర తగ్గి.. రూ. 90 వేల 500 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలన్నీ కూడా ఎటువంటి జీఎస్‌టీ, టీసీఎస్ లాంటి టాక్స్ లు కలపకుండా ఉన్న రేట్స్. ఒకవేళ ఈ ధరలకు టాక్స్ లు కూడా యాడ్ అయితే.. ఇప్పుడు చెప్పుకున్న ధరలలో అటు ఇటుగా మార్పులు జరుగుతాయి. మరి నేటి బంగారం ధరల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.