Dharani
Gold, Silver Rate: బంగారం కొందామనుకునేవారికి భారీ షాక్ అని చెప్పవచ్చు. క్రితం సెషన్ లలో దిగి వచ్చిన రేటు నేడు ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ తులం ధర ఎంత ఉందంటే..
Gold, Silver Rate: బంగారం కొందామనుకునేవారికి భారీ షాక్ అని చెప్పవచ్చు. క్రితం సెషన్ లలో దిగి వచ్చిన రేటు నేడు ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ తులం ధర ఎంత ఉందంటే..
Dharani
బడ్జెట్ తర్వాత వారం, పది రోజుల పాటు దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా ఎగబాకుతున్నాయి. గత వారం వరకు పసిడి రేటు పది గ్రాముల మీద ఏకంగా 7 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. సిల్వర్ రేటు కూడా భారీగానే పడిపోయింది. దాంతో బంగారం కొనాలనుకునే వారు.. జ్యూవెలరీ షాపులకు క్యూ కట్టారు. పైగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో.. పుత్తడి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇక ఈ నెల అంతా పసిడి ధర దిగి వస్తుంది అనుకున్న వాళ్లకి.. ఇప్పుడు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి పుత్తడి ధర పెరుగుతుంది. క్రితం సెషన్ లో స్థిరంగా ఉన్న ధర.. నేడు మాత్రం భారీగా పెరిగింది. మరి ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గత మూడు, నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా రోజుల్లో రూ. 750, రూ. 200 చొప్పున పెరగ్గా.. నేడు అనగా మంగళవారం నాడు మరోసారి పసిడి రేటు పెరిగింది. ఇక ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద రూ. 250 పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల రేటు రూ. 64,700 మార్కుకు చేరింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాముల రూ. 270 ఎగబాకి. 70,580కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 250 ఎగబాకి రూ. 64,850కు చేరింది. ఇక 24 క్యారెట్ బంగార రేటు పది గ్రాముల మీద రూ. 270 ఎగబాకి తులం రూ. 70,730 కు ఎగబాకింది.
నేడు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరగ్గా.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ. 600 పతనంతో రూ. 82,500 కు చేరింది. అంతకుముందు మాత్రం 2 రోజుల్లో రూ. 1600 పెరిగింది. ఇదే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే రూ. 600 పడిపోయి కిలోకు రూ. 87,500 వద్ద ఉంది.