iDreamPost

Gold Rate: వరుసగా దిగి వచ్చి.. సడెన్‌గా షాకిచ్చిన గోల్డ్‌ రేటు.. నేడు ఎంత పెరిగిందంటే..

  • Published Jun 21, 2024 | 9:39 AMUpdated Jun 21, 2024 | 9:39 AM

క్రితం రెండు సెషన్‌లలో దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇంతకు ఎంత పెరిగిందంటే..

క్రితం రెండు సెషన్‌లలో దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇంతకు ఎంత పెరిగిందంటే..

  • Published Jun 21, 2024 | 9:39 AMUpdated Jun 21, 2024 | 9:39 AM
Gold Rate: వరుసగా దిగి వచ్చి.. సడెన్‌గా షాకిచ్చిన గోల్డ్‌ రేటు.. నేడు ఎంత పెరిగిందంటే..

బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొని ఉంది. క్రితం రెండు సెషన్‌లలో గోల్డ్‌ రేటు తగ్గడం, స్థిరంగా కొనసాగడంగా ఉన్న పసిడి ధర.. ఉన్నట్లుండి భారీగా పెరిగింది. ఇక గోల్డ్‌ రేటు పంథా చూస్తే.. జనాలకు రేటు ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు దిగి వస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. హమ్మయ్యా ఇవాళ రేటు తగ్గింది.. చూద్దాం మరి కొంత తగ్గుతుందేమో అని చూస్తే.. ఉన్నట్లుండి ఒక్కసారి భారీ ఎత్తున పెరిగి కోలుకోలేని విధంగా షాక్‌ ఇస్తుంది. పెరుగుతుందని భావించి.. కొంటే.. సడెన్‌గా తగ్గి అంతకు మించిన షాక్‌ ఇస్తుంది. ఇక రెండు సెషన్‌లలో ఒక రోజు స్వల్పంగా దిగి వచ్చి.. మరో రోజు స్థిరంగా ఉన్న రేటు.. ఇవాళ మాత్రం సడెన్‌గా పెరిగి.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ అనగా శుక్రవారం నాడు.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు పెరిగింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పసిడి రేటు పది గ్రాముల మీద నేడు 200 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 66,400కు చేరింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద 220 రూపాయలు పెరిగింది. దాంతో శుక్రవారం నాడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ బంగారం రూ.72,440 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌తో పాటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర భారీగా పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద రూ. 200 పెరిగి.. రూ. 66,550 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 220 పెరిగి రూ. 72,590 వద్ద ఉంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద 200 రూపాయలు పెరిగితే.. వెండి కేజీ మీద ఏకంగా 1500 పెరిగి భారీ షాక్‌ ఇచ్చింది. ఇవాళ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ రేటు కేజీ మీద రూ.1500 పెరిగి.. రూ. 97,100 మార్కు వద్ద ఉంది. అలానే ఢిల్లీలో కూడా నేడు వెండి ధర కేజీ మీద 1500 రూపాయలు పెరిగి 92,500 రూపాయలు పెరిగింది. అటు అంతర్జీతయ బులియన్‌ మార్కెట్‌లో కూడా నేడు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి