iDreamPost
android-app
ios-app

వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే!

  • Published Aug 24, 2023 | 8:06 AMUpdated Aug 24, 2023 | 8:06 AM
  • Published Aug 24, 2023 | 8:06 AMUpdated Aug 24, 2023 | 8:06 AM
వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే!

శ్రావణమాసంలో మన దగ్గర బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. శుభకార్యాలు, పండగలు ప్రారంభం అవుతాయి. ఇక శ్రావణమాసంలో మహిళలు బంగారం కొంటే శుభప్రదం అని భావిస్తారు. మరీ ముఖ్యంగా మహాలక్ష్మి వ్రతం రోజున బంగారం కొంటే లక్ష్మి దేవి ఇంటి​కి తరలి వస్తుందని నమ్ముతారు. దాంతో శ్రావణమాసంలో గోల్డ్‌కి డిమాండ్‌ భారీగా ఉంటుంది. దాంతో రేటు కూడా పెరుగుతుంది. తాజాగా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్ట్‌ నెల ప్రారంభం నుంచి దిగి వచ్చిన గోల్డ్‌ రేటు.. శ్రావణ మాసంలో పెరుగుతూ వస్తోంది. నేడు వరుసగా మూడో రోజు పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం మన హైదరాబాద్, ఢిల్లీలో గోల్డ్ రేటు 10 గ్రాముల మీద ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం..

నేడు, హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర పెరిగింది. భాగ్యనగరంలో గురువారం.. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద 100 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ. 54,300 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ. 100 పెరిగింది. ప్రస్తుతం భైదరాబాద్‌లో 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు రూ. 59,230 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు ఇవాళ రూ. 150 పెరిగి రూ. 54,450 మార్క్ వద్ద ట్రేడవుతుంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర రేటు రూ. 180 పెరిగి 10 గ్రాముల ధర రూ. 59,400 వద్ద ట్రేడవుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

ఇక నేడు బంగారం బాటలోనే వెండి పయనించింది. క్రితం సెషన్‌లో కిలో వెండి ధర 1500 పెరగ్గా.. నేడు కూడా భారీగానే పెరిగింది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే వెండి ధర కిలో మీద రూ. 500 పెరిగి.. రూ. 78,500 మార్క్‌కు చేరింది. ఇక ఈ రెండు రోజుల్లోనే హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా 2 వేల రూపాయలు పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ రూ. 500 పెరిగి రూ. 75,300 పలుకుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి