iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారం ధర

  • Published Nov 08, 2023 | 8:46 AMUpdated Nov 08, 2023 | 8:46 AM

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. రెండు రోజుల నుంచి గోల్డ్‌ రేటు దిగి వస్తోంది. ఇక నేడు సిల్వర్‌ రేటు కూడా భారీగా పడిపోయింది. మరి నేడు పుత్తడి ధర ఎంత ఉందంటే..

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. రెండు రోజుల నుంచి గోల్డ్‌ రేటు దిగి వస్తోంది. ఇక నేడు సిల్వర్‌ రేటు కూడా భారీగా పడిపోయింది. మరి నేడు పుత్తడి ధర ఎంత ఉందంటే..

  • Published Nov 08, 2023 | 8:46 AMUpdated Nov 08, 2023 | 8:46 AM
గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారం ధర

బంగారం కొనాలనుకుని పెరుగుతున్న ధర చూసి ఆగిపోతున్నారా.. అయితే మీకో శుభవార్త. అలానే పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా గోల్డ్‌ కొనాలనుకునే వారికి కూడా ఇది నిజంగానే బంగారం లాంటి వార్త. ఇన్ని రోజుల పాటు వరుసగా పెరుగుతున్న పసిడి రేటు.. గత కొన్ని రోజులుగా దిగి వస్తోంది. క్రితం సెషన్‌లో పుత్తడి ధర దిగి రాగా.. నేడు కూడా పడిపోయింది. అలానే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. ఆ ప్రభావం దేశీయ బులియన్‌ మార్కెట్‌ మీద కూడా ఉంది. మరి నేడు గోల్డ్‌ ధర ఎంత పడిపోయింది.. అలానే వెండి రేటు ఎంత ఉంది వంటి వివరాలు..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఇక హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల మీద రూ. 100 దిగి వచ్చింది. దాంతో ప్రస్తుతం భాగ్యనగరంలో 22 క్యారెట్‌ కనకం పది గ్రాముల ధర రూ. 56,250 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద రూ. 110 దిగి వచ్చి.. రూ. 61,360 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం పసిడి ధర పడిపోయింది. నేడు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల మీద రూ.100 దిగి వచ్చింది. దాంతో నేడు హస్తినలో 22 క్యారెట్‌ పుత్తడి ధర రూ. 56,400 మార్కు వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల మీద రూ .110 పడిపోయి.. రూ. 61,510 వద్ద ఉంది.

బంగారం బాటలో వెండి

క్రితం సెషన్‌లో బంగారం ధర దిగి వచ్చినా వెండి రేటు మాత్రం పెరుగుతూ వచ్చింది. కానీ నేడు మాత్రం.. సిల్వర్‌ కూడా గోల్డ్‌ బాటలోనే పయనించింది. బుధవారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర భారీగా దిగి వచ్చింది. ఇక నేడు ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద రూ. 700 తగ్గి రూ. 74,500 వద్ద ట్రేడవుతోంది. అలానే హైదరాబాద్‌ మార్కెట్‌లో సైతం వెండి ధర కిలో మీద రూ. 700 పడిపోయి రూ. 77,500 వద్ద ట్రేడవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 1968 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలానే స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 22.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడంతో రేటు తగ్గుతూ వస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో బంగారం రేటు దిగి వస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి