పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర

పండుగ పూట బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పసిడి ధర నేడు కూడా తగ్గింది. మరి నేడు గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..

పండుగ పూట బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పసిడి ధర నేడు కూడా తగ్గింది. మరి నేడు గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..

అసలే దీపావళి పండుగ.. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం.. దాంతో చాలా మంది బంగారం కొనాలని భావిస్తారు. పండుగ వేళ ఇంటికి ‍లక్ష్మీ దేవిని తీసుకువస్తే.. అన్ని విధాల కలసి వస్తుందని నమ్ముతారు. అయితే పెరుగుతున్న గోల్డ్‌ రేటు చూసి.. బంగారం కొనాలంటేనే.. అమ్మో అనుకునే పరిస్థితి. పైగా ఈ ఏడాది బంగారం ధర గరిష్టాలకు చేరింది. దాంతో చాలా మంది పసిడి కొనాలని ఉన్నా సరే.. పెరుగుతున్న ధర చూసి వెనకడుగు వేస్తున్నారు. దాంతో దీపావళికి బంగారం కొనుగోళ్లు అంతగా ఉండవని భావించారు. కానీ అందుకు భిన్నంగా రేటు దిగి రావడంతో.. కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుసగా కొన్ని రోజులుగా దిగివస్తోన్న బంగారం ధర నేడు కూడా తగ్గింది. మరి నేడు పుత్తడి రేటు ఎంత ఉందంటే..

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి రేటు పడిపోయింది. మంగళవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ.90 పడిపోయి రూ. 55, 450 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా దిగివచ్చింది. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పుత్తడి రేటు పది గ్రాముల మీద రూ.100 తగ్గి ప్రస్తుతం రూ. 60,490 వద్ద అమ్ముడవుతోంది.

అలానే దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 90 రూపాయలు దిగి వచ్చి ప్రస్తుతం రూ. 55,600 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి రూ. 60,640 వద్ద అమ్ముడవుతోంది.

భారీగా దిగి వచ్చిన వెండి ధర..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. భారీగా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలో మీద ఏకంగా రూ. 600 మేర పడిపోయింది. దాంతో ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.74,500 వద్ద ట్రేడవుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్‌లో కూడా వెండి ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో సిల్వర్‌ రేటు కిలో మీద రూ.600 మేర పడిపోయి రూ. 72,400కు దిగివచ్చింది.

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రాగా.. అంతర్జాతీయంగా మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు 1947 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ప్రస్తుతం 22.40 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

Show comments