iDreamPost

Gold Rate: బంగారం కొనాలనుకుంటే లేట్‌ చేయొద్దు.. భారీగా దిగి వచ్చిన ధర

  • Published Jun 23, 2024 | 11:04 AMUpdated Jun 23, 2024 | 11:04 AM

బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయండి. నేడు పసిడి ధర భారీగా దిగి వచ్చింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయండి. నేడు పసిడి ధర భారీగా దిగి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 11:04 AMUpdated Jun 23, 2024 | 11:04 AM
Gold Rate: బంగారం కొనాలనుకుంటే లేట్‌ చేయొద్దు.. భారీగా దిగి వచ్చిన ధర

బంగారం కొనాలనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకండి. క్రితం సెషన్‌లో అనగా భారీగా పెరిగిన ధర.. నేడు మాత్రం అనూహ్య రీతిలో భారీగా దిగి వచ్చింది. శనివారం నాడు పెరిగిన ధర కన్నా ఆదివారం దిగి వచ్చిన రేటు ఎక్కువగా ఉంది. కనుక గోల్డ్‌ కొనాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజే కొనుగోలు చేయండి. ఇక శనివారం నాడు బంగారం ధర పది గ్రాముల మీద ఏకంగా 750, 810 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు భారీ షాకిచ్చింది. కానీ ఆదివారం నాడు మాత్రం అంతకంటే ఎక్కువ మొత్తంలో దిగి వచ్చింది. వెండి ధర కూడా ఇదే స్థాయిలో పతనం అయ్యింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి.. పది గ్రాముల మీద ఎంత దిగి వచ్చాయి అంటే..

క్రితం సెషన్‌లో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరగ్గా.. ఆదివారం మాత్రం అంతకన్నా ఎక్కువగా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీదర 800 రూపాయలు దిగి వచ్చింది. దాంతో నేడు భాగ్యనగరంలో పది గ్రాముల 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 66,350కి దిగి వచ్చింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా భారీగానే పడిపోయింది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాముల మీద రూ. 870 మేర పడిపోయి రూ. 72 వేల 380 వద్దకు దిగివచ్చింది.

Gold rates are Down

ఇక దేశరాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కూడా నేడు గోల్డ్‌ రేటు భారీగానే దిగి వచ్చింది. ఆదివారం నాడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల మీద 800 మేర తగ్గి రూ. 66,500 వద్దకు దిగివచ్చింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ. 870 తగ్గి రూ. 72,530 వద్దకు దిగొచ్చింది. నేడు దేశీయంగా ధరలు తగ్గేందుకు అమెరికా డాలర్ విలువలో మార్పు కారణమైందని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. డాలర్ విలువ పెరిగితే బంగారం రేటు పడిపోతుంటుంది. అదే డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారానికి ధర పెరుగుతుంటుంది. క్రితం రోజు యూఎస్ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరగడం పసిడి విలువ తగ్గేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రూ.2000 పడిపోయిన వెండి రేటు..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. భారీగా దిగి వచ్చింది. ఇవాళ అనగా ఆదివారం నాడు హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఒక్కరోజే కిలో వెండి రేటు రూ.2000 మేర దిగి వచ్చింది. దీంతో నేడు భాగ్యనగరంలో కేజీ సిల్వర్‌ ధర రూ. 96,500 కు పడిపోయింది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో చూసుకుంటే కిలో వెండి రేటు ఇవాళ రూ. 2000 మేర తగ్గి రూ. 92 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఈ ధరల్లో ఎలాంటి పన్నులు కలిసి లేవు. ఆయా ట్యాక్సులు కలిపినట్లయితే ధరల్లో తేడా ఉండొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి