iDreamPost
android-app
ios-app

Gold, Silver Rate: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు ఎంత తగ్గాయంటే

  • Published Dec 14, 2023 | 8:14 AMUpdated Dec 14, 2023 | 8:14 AM

బంగారం కొనాలనుకుని ఆగిపోతున్న వారు త్వరపడండి.. ఇప్పుడే గోల్డెన్ ఛాన్స్.. ఈ అవకాశం మిస్ అయితే మళ్లీ రాదు అంటున్నారు. వరుసగా దిగి వస్తోన్న పసిడి రేటు నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

బంగారం కొనాలనుకుని ఆగిపోతున్న వారు త్వరపడండి.. ఇప్పుడే గోల్డెన్ ఛాన్స్.. ఈ అవకాశం మిస్ అయితే మళ్లీ రాదు అంటున్నారు. వరుసగా దిగి వస్తోన్న పసిడి రేటు నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 8:14 AMUpdated Dec 14, 2023 | 8:14 AM
Gold, Silver Rate: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు ఎంత తగ్గాయంటే

బంగారానికి, భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. గోల్డ్ అంటే మన దగ్గర కేవలం విలువైన లోహం మాత్రమే కాక.. లక్ష్మీ దేవి స్వరూపం. అందుకే సందర్భం వచ్చిన ప్రతి సారి పుత్తడి కొనుగోలు చేస్తారు. ఇక వివాహాల సమయంలో అయితే మన దగ్గర పసిడి కొనుగోళ్లు విపరీతంగా జరుగుతాయి. మనదేశంలో ఏడాదంతా బంగారానికి డిమాండ్ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్ రేటు.. భారీగా పెరుగుతూ పోయి.. ఏడాది గరిష్టాలకు చేరింది. అయితే, ఇప్పుడు మళ్లీ వరుసగా ధరలు దిగివస్తూ భారీ ఊరట కలిగిస్తున్నాయి. గత ఏడు రోజులుగా బంగారం ధర 10 గ్రాముల మీద ఏకంగా రూ.1000 కిపైగా దిగివచ్చింది. నేడు కూడా దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి, ధరలు దిగి వచ్చాయి.  నేడు గోల్డ్, సిల్వర్ రేటు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

గత మూడు రోజులుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. ఇక వారం రోజుల వ్యవధిలోనే పుత్తడి ధర 10 గ్రాముల మీద 1000 రూపాయల వరకు దిగి వచ్చింది. నేడు కూడా గోల్డ్ రేటు పడిపోయింది. ఇవాళ భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వాడే.. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద రూ. 100 మేర తగ్గి రూ. 56,650 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.110 మేర తగ్గి రూ. 61,800 వద్ద అమ్ముడవుతోంది.

Gold price fell again

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు గోల్డ్ రేటు దిగి వచ్చింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల మీద రూ.100 మేర పడిపోయింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.56,800 వద్దకు దిగివచ్చింది. అలానే 24 క్యారెట్ పుత్తడి రేటు 10 గ్రాముల మీద రూ.110 తగ్గి ప్రస్తుతం రూ. 61,950 వద్ద కొనసాగుతోంది.

కిలో మీద రూ.700 తగ్గిన వెండి ధర..

గత పది రోజులుగా భారీగా దిగి వస్తోన్న వెండి ధర నేడు కూడా అదే స్థాయిలో పడిపోయింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి రేటు కిలో మీద ఏకంగా రూ.700 మేర పడిపోయింది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధర కిలో మీద రూ.700 పడిపోయి రూ. 77 వేల స్థాయికి దిగివచ్చింది. అలానే ఢిల్లీ మార్కెట్లో సిల్వర్ రేటు కిలో మీద రూ.700 మేర పడిపోయి ప్రస్తుతం రూ.75 వేల వద్దకు దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో డిసెంబర్ 5 నుంచి కిలో వెండి రేటు ఏకంగా రూ.5500 మేర పడిపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి