Dharani
Today Gold, Silver Rate: శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. తెలుగు లోగిళ్లు.. పండుగ వాతావరణంతో కలకల్లాడుతున్నాయి. దీన్ని మరింత పెంచడం కోసమే అన్నట్లుగా బంగారం రేటు భారీగా దిగి వస్తోంది. ఆ వివరాలు..
Today Gold, Silver Rate: శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. తెలుగు లోగిళ్లు.. పండుగ వాతావరణంతో కలకల్లాడుతున్నాయి. దీన్ని మరింత పెంచడం కోసమే అన్నట్లుగా బంగారం రేటు భారీగా దిగి వస్తోంది. ఆ వివరాలు..
Dharani
పసిడి ప్రియులకు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్‌లో భారీగా దిగి వస్తోన్న బంగారం ధర.. నేడు మరింతగా పడిపోయింది. అలానే వెండి రేటు కూడా. అమెరికాలో ఆర్థిక మాద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులతో దేశీయ స్టాక్ మార్కెట్ల భారీగా పడిపోతున్న క్రమంలో ఆ ప్రభావం పసిడి పెట్టుబడిదారులపై పడింది. దీంతో గ్లోబల్ గోల్డ్ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. దాంతో పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అలానే శ్రావణమాసం వచ్చేసింది. సరిగ్గా ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా దిగివస్తుండడం సంతోషకర పరిణామం అని.. ఇది ఇలానే కొనసాగితే.. బంగారం కొనుగోళ్లు దిగి వస్తాయిని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎంత దిగి వచ్చాయో ఒకసారి చూడండి.
నేడు అనగా.. బుధవారం నాడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇవాళ భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల రేటు 800 రూపాయల మేర దిగి వచ్చింది. దాంతో ఇవాళ హైదరాబాద్‌లో 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల రేటు రూ. 63,900 వద్దకు దిగివచ్చింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం రేటు కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాముల మీద రూ. 870 మేర దిగి వచ్చి రూ. 69,710 వద్ద అమ్ముడవుతోంది.
అలానే నేడు ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 800 మేర పడిపోయి రూ. 64,050 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర రూ. 870 మేర తగ్గి రూ. 69,860 వద్దకు దిగివచ్చింది.
ఇక నేడు బంగారంతో పాటు వెండి రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద ఏకంగా రూ.3500 మేర దిగివచ్చింది. దాంతో నేడు భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 87,500 వద్దకు పడిపోయింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే.. సిల్వర్ రేటు కిలో మీద రూ. 3500 మేర తగ్గి రూ. 82,500 వద్దకు దిగివచ్చింది. గోల్డ్, సిల్వర్ రేట్లలో జీఎస్టీ, టీసీఎస్ సహా ఏ ట్యాక్సులు కలపలేదు. ప్రాంతాలను బట్టి పన్నులు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందే ధరలు తెలుసుకోవడం మంచిది.