iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Published Aug 03, 2023 | 8:05 AMUpdated Aug 03, 2023 | 8:05 AM
  • Published Aug 03, 2023 | 8:05 AMUpdated Aug 03, 2023 | 8:05 AM
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనాలో, వద్దో అర్థం కానీ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెండు, మూడు రోజుల పాటు స్వల్పంగా రేటు దిగి వస్తుంది. అది చూసి హమ్మయ్యా.. ఇక బంగారం కొనుగోలు చేయవచ్చని భావిస్తుండగానే.. భారీ షాక్‌ ఇస్తూ.. ఎంత దిగి వస్తుందో.. అందుకు రెట్టింపు పెరిగి.. కోలుకోలేని షాక్‌ ఇస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్‌ ఉండటంతో.. ధర దిగి రావడం లేదు.

మన దగ్గర బంగారం ధర రేటు దిగి రావాలంటే అంతర్జాతీయంగా గోల్డ్‌ రేటు పడిపోవాలి. అది జరగాలంటే.. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించాలి. అయితే ఈమధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గినా.. మన దగ్గర మాత్రం గోల్డ్‌ రేటు దిగి రావడం లేదు. ఇక క్రితం సెషన్‌లో బంగారం ధర భారీగా పెరగ్గా.. నేడు బంగారం, వెండి రేట్లు దిగి వచ్చాయి. మరి నేడు బంగారం ధర ఎంత దిగి వచ్చింది అంటే..

నేడు హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద ఒక్కరోజులోనే రూ.300 దిగొచ్చింది. దాంతో నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల రేటు రూ.55,100కు చేరింది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర కూడా దిగి వచ్చింది. నేడు 24 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద సుమారు రూ.330 పడిపోయి రూ. 60,110కి దిగొచ్చింది. ఇక అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 300 తగ్గి రూ.55,250 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ పుత్తడి రేటు పది గ్రాముల మీద రూ. 310 తగ్గి రూ.60,260 వద్ద కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి..

బంగారం ధర తగ్గిన నేపథ్యంలో వెండి ధర కూడా దిగి వచ్చింది. క్రితం సెషన్‌లలో హైదరాబాద్ మార్కెట్‌లో సిల్వర్ రేటు వరుసగా పెరగ్గా.. తాజాగా తగ్గింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర సుమారు రూ.700 తగ్గి రూ.80,300 మార్కు వద్ద అమ్ముడవుతోంది. అలానే ఢిల్లిలో వెండి ధర కిలో మీద రూ.700 తగ్గి రూ. 77,300కు చేరింది. అంతకుముందు రూ.1000 మేర ఎగబాకడం గమనార్హం. ఇక అంటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1936 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.72 వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి