iDreamPost
android-app
ios-app

శ్రావణమాసంలో శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..

  • Published Aug 18, 2023 | 8:05 AM Updated Updated Aug 18, 2023 | 8:05 AM
  • Published Aug 18, 2023 | 8:05 AMUpdated Aug 18, 2023 | 8:05 AM
శ్రావణమాసంలో శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..

మన దగ్గర పండగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక పరంగా ముఖ్యమైన శ్రావణమాసం వంటి సమయంలో.. బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. గోల్డ్‌కు డిమాండ్‌ పెరిగితే.. ఆటోమెటిగ్గా.. ధర పెరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర దిగి వస్తుండగా.. శ్రావణ మాసంలో కూడా గోల్డ్‌ రేటు పడిపోతుంది. గత పది సెషన్లలో ఏకంగా ఏడు సార్లు బంగారం రేటు దిగి వచ్చింది. ఈక్రమంలో నేడు కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధర ఎంత దిగి వచ్చింది.. 10 గ్రాముల గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధర వరుసగా పతనం అవుతుంది . ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో చూస్తే గోల్డ్ రేటు వరుసగా మూడో రోజు కూడా దిగి వచ్చింది. ఈరోజు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.350 తగ్గి రూ. 54,100కి దిగొచ్చింది. ఇది గత 10 రోజుల్లో చూస్తే 22 క్యారెట్‌ బంగారం ధర ఏకంగా రూ.1150 తగ్గింది.

ఇదే సమయంలో నేడు 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 380 తగ్గి ప్రస్తుతం రూ. 59,020 వద్ద కొనసాగుతోంది. ఇక గత 10 రోజుల్లో 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.1250 పడిపోయింది. ఇక నేడు ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 350 తగ్గి రూ. 54,250 వద్ద ట్రేడవుతుంది. ఇక 24 క్యారెట్‌ బంగారం ధర రూ. 380 పడిపోయి రూ. 59,170 మార్కు వద్ద కొనసాగుతోంది.

నేల చూపులు చూస్తోన్న వెండి రేటు..

బంగారం బాటలోనే వెండి రేటు కూడా దిగి వస్తోంది. ఇక నేడు ఢిల్లీలో తాజాగా కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 72,500 మార్కు వద్ద ట్రేడవుతోంది. అయితే క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద రూ. 200 పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లోనూ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 75,700 దిగొచ్చింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ పుంజుకొని.. బంగారం విలువ పడిపోతుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.