iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకుంటున్నారా..? ఇదే మంచి సమయం! ఈ రోజు ధర ఎంతంటే?

  • Published Sep 19, 2024 | 8:11 AM Updated Updated Sep 19, 2024 | 8:11 AM

Today Gold and Silver Rates: దేశంలో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. గత కొంత కాలంగా బంగారం ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర రూ.75 వేలకు చేరుకుంది.

Today Gold and Silver Rates: దేశంలో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. గత కొంత కాలంగా బంగారం ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర రూ.75 వేలకు చేరుకుంది.

బంగారం కొనాలనుకుంటున్నారా..? ఇదే మంచి సమయం! ఈ రోజు ధర ఎంతంటే?

గత నెల రోజుల నుంచి బంగారం ధరలు ఒకటీ రెండు రోజులు మినహాయిస్తే చాలా వరకు తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం వల్ల పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్నిసార్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో కొనుగోలు శాతం కాస్త తగ్గింది. గత నెల నుంచి శ్రావణ మాసం ప్రారంభం నుంచి పండుగలు, శుభకార్యాలు జరుగుతున్న నేపథ్యంలో క్రమంగా దేశయంగా బంగారం దిగుమతులు భారీగీ పెరిగిపోయాయి. గత ఆగస్టు నెలలో 10.6 బిలియన్ డాలర్ల గోల్డ్ దిగుమతైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. నేడు పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మహిళలకు గొప్ప శుభవార్త. పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజుల క్రితం వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పుత్తడి ధరలు రెండు రోజులుగా తగ్గడంతో మళ్లీ కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతుంది. బంగారం ధరలు తగ్గినపుడు కొంటే మంచి లాభం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో బంగారం ఆభరణాలుగా మాత్రమే కాదు.. భవిష్యత్ లో సెక్యూరిటీగా ఉంటుందని భావిస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 19) నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.68,490 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,రూ.74,720 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,720 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,870 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,720 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,720 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.90,900 వద్ద కొనసాతుంది. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో రూ.95,900 గా ఉంది. ఢిల్లీ, కేరళా, ముంబాయి లో కిలో వెండి ధర రూ.90,900, బెంగుళూరు లో కిలో వెండి రూ.85,900 వద్ద కొనసాగుతుంది.