పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు న్యూఇయర్ వేళ కాస్త ఊరటనిచ్చే అంశం. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం గోల్డ్ ధర ఎంతంటే?

పసిడి ప్రియులకు న్యూఇయర్ వేళ కాస్త ఊరటనిచ్చే అంశం. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం గోల్డ్ ధర ఎంతంటే?

కొత్త సంవత్సరం వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇటీవల అంతకంతకూ పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు ఊరట కలిగిస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలు వినియోగదారులకు షాకిస్తుండగా నేడు పసిడి ధరలు పెరగకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చును. ధరల విషయం పక్కనపెడితే.. మనదేశంలో సీజన్ తో సంబంధం లేకుండా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. శుభకార్యాలకు, పండగపబ్బాలకే కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్యకూడా పెరుగుతోంది. అలాంటి వారికి నేడు స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్స్ కలిసొచ్చే అంశమే. ఈ రోజు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటివి ప్రభావం చూపుతుంటాయి. కాగా నిన్న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 63,870 వద్దు అమ్ముడవగా.. ఈరోజు బంగారం ధరల్లో మార్పు లేకపోవడంతో రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 58,550 వద్దకు చేరుకోగా ఈరోజు ధరలు స్థిరంగా ఉండడంతో రూ.58,550 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర రూ. 58,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబయి, బెంగళూరు నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ గోల్డ్ ధర రూ. 63,970 కాగా 10గ్రాముల 22క్యారెట్ పసిడి ధర రూ. 58,700 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. నేడు సిల్వర్ రేట్స్ లో ఏవిధమైన మార్పు చోటుచేసుకోలేదు. కొద్ది రోజులుగా ఆకాశాన్నంటుతున్న వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగడం వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే విధంగా ఉంది. హైదరాబాద్‎లో కిలో వెండి ధర నిన్న రూ. 80,000 ఉండగా.. ఈరోజు ధరలు పెరగకపోవడంతో అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విజయవాడలో కూడా సిల్వర్ ధర రూ. 80,000 వద్ద స్థిరంగా ఉండి ట్రేడ్ అవుతోంది. ఇక దేశ రాజధాని హస్తినలో కూడా సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. నిన్న కిలో వెండి ధర రూ. 78,600 ఉండగా నేడు అదే ధరల్లో స్థిరంగా కొనసాగుతోంది.

Show comments