iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు భారీ ఊరట.. వరుసగా రెండో రోజు కూడా

  • Published Nov 20, 2023 | 9:04 AMUpdated Nov 20, 2023 | 9:04 AM

గత కొన్ని రోజులుగా అలుపన్నది లేకుండా పరుగులు తీస్తోన్న వెండి, బంగారం ధరలకు నేడు బ్రేక్‌ పడింది. ఇవాళ గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర ఎలా ఉంది అంటే..

గత కొన్ని రోజులుగా అలుపన్నది లేకుండా పరుగులు తీస్తోన్న వెండి, బంగారం ధరలకు నేడు బ్రేక్‌ పడింది. ఇవాళ గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర ఎలా ఉంది అంటే..

  • Published Nov 20, 2023 | 9:04 AMUpdated Nov 20, 2023 | 9:04 AM
పసిడి ప్రియులకు భారీ ఊరట.. వరుసగా రెండో రోజు కూడా

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమంటే.. వారి దగ్గర కిలోల కొద్ది పసిడి ఉన్నా సరే.. మళ్లీ కొనుగోలు చేస్తారు. బంగారం అంటే మన దగ్గర స్టేటస్‌ చిహ్నంగా కూడా భావిస్తారు. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి వారి కోసం ప్రతి ఏటా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనాలంటే ఇబ్బంది కనుక ఇలా చేస్తారు. ఇక మన దగ్గర పుత్తడి లేకుండా వివాహాలు జరగవు. ఎంత పేదవారైనా సరే.. కుమార్తెకు పెళ్లి చేసే సమయంలో కచ్చితంగా తమ స్థోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత పసిడి పెడతారు. అయితే గత కొంత కాలం నుంచి గోల్ట్‌ రేటు పెరుగుతూనే ఉంది. ఇక దీపావళి తర్వతా అయితే బంగారం ధర భారీగా పెరుగుతూ పోయింది. కానీ గత రెండు సెషన్ల నుంచి మాత్రం పుత్తడి రేటు స్థిరంగా ఉంది. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది.. అంటే..

క్రితం సెషన్‌లో దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు కూడా అదే కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌ల ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. ఇక సోమవారం నాడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ పుత్తడి పది గ్రాముల ధర 56,550 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా పెరగలేదు. ఇవాళ 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగానే ఉంది. నేడు హస్తినలో 2 క్యారెట్‌ పసిడి పది గ్రాముల రేటురూ. 56,700గా ఉంది. అలానే 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర కూడా 61,690 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

బంగారం బాటలోనే వెండి..

గత ​కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ పోతున్న వెండి ధర నేడు మాత్రం బంగారం బాటలోనే పయనించింది. క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద 500 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే. ఇక నేడు మాత్రం స్థిరంగా కొనసాగింది. ఇవాళ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో కిలో సిల్వర్‌ రేటు 79 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అలానే ఢిల్లీలో కూడా వెండి రేటు రూ.76 వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర తక్కువగాను.. వెండి రేటు కాస్త ఎక్కువగాను ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఇక అంతర్జాతీయంగా కూడా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా పెరుగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి