iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

  • Published Nov 17, 2023 | 8:35 AMUpdated Nov 17, 2023 | 8:35 AM

క్రితం రెండు సెషన్లలో భారీగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. కానీ సిల్వర్‌ పరుగు మాత్రం ఆగడం లేదు. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రితం రెండు సెషన్లలో భారీగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. కానీ సిల్వర్‌ పరుగు మాత్రం ఆగడం లేదు. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • Published Nov 17, 2023 | 8:35 AMUpdated Nov 17, 2023 | 8:35 AM
పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం కొనాలనుకునే వారికి నేడు కాస్త ఊరట కలిగించే న్యూస్‌. గత రెండు సెషన్లలో భారీగా పెరిగిన ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం వివాహాల సీజన్‌ కావడంతో.. గోల్డ్‌కు డిమాండ్‌ భారీగా ఉంటుంది.. దాంతో ధర పెరుగుతూనే ఉంటుంది తప్ప దిగి రాదు అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. కనుక రేటు దిగి వచ్చిన సమయంలోనే త్వరపడాలని.. ఆలస్యం చేస్తే.. భారీగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. ఇక గత రెండు రోజుల్లో బంగారం ధర పది గ్రాముల మీద ఏకంగా 500 రూపాయలు పెరిగింది. వెండి రేటు అయితే ఒక్కరోజే 1700 రూపాయలు జంప్‌ అయ్యింది. ఇక నేడు పుత్తడి ధర స్థిరంగా ఉంటే.. సిల్వర్‌ రేటు మాత్రం అదే స్పీడ్‌తో పెరుగుతూనే ఉంది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న గోల్డ్‌ రేటు నేడు మాత్రం స్థిరంగా ఉంది. క్రితం రెండు సెషన్లలో పుత్తడి ధర పది గ్రాముల మీద ఏకంగా రూ.500 పెరిగిన సంగతి తెలిసిందే. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ. 55,950 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి గోల్డ్ రేటు క్రితం సెషన్‌లో ఉన్నంతే నేడు ఉంది. 24 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర నేడు రూ. 62,040 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ పుత్తడి ధర 10 గ్రాములకు 56,100 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు క్రితం సెషన్‌లో ఉన్నంతే అనగా.. 61,190 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర తక్కువగా.. వెండి ధర ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.

పరుగాపని వెండి ధర..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం పరుగులు పెడుతూనే ఉంది. క్రితం సెషన్‌లో భారీగా పెరిగిన సిల్వర్‌ రేటు నేడు కూడా అదే బాటలో పయనించింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలో మీద రూ.300 పెరిగింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 78 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. అలానే ఢిల్లీలో కూడా వెండి ధర కిలో మీద 300 రూపాయలు పెరిగి 75 వేల రూపాయల వద్ద అమ్ముడవతోంది. మొత్తంగా ఈ మూడు రోజుల్లే సిల్వర్‌ రేటు కిలో మీద రూ.2600 పెరగడం గమనార్హం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు మళ్లీ 2000 డాలర్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1984 డాలర్ల పైన ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.87 డాలర్ల వద్ద ఉంది. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు మార్కెట్‌ నిపుణులు. కనుక ధర తగ్గినప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి