Dharani
Gold,Silver Price On Aug 15th: వరలక్ష్మి వ్రతం సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే పసిడి ధరలు నేడు ఊరట కలిగిస్తున్నాయి. మరి ఇవాళ బంగారం ధర ఎంత ఉందంటే..
Gold,Silver Price On Aug 15th: వరలక్ష్మి వ్రతం సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే పసిడి ధరలు నేడు ఊరట కలిగిస్తున్నాయి. మరి ఇవాళ బంగారం ధర ఎంత ఉందంటే..
Dharani
శ్రావణ మాసం వచ్చిందంటే చాటు.. తెలుగు లోగిళ్లల్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ నెల నుంచే వరుస పండగలు వస్తాయి. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం ఉంది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు ఎంతో కొంత బంగారం కొనాలని భావిస్తారు. గతేడాది ఇదే సమయంలో పసిడి ధరలు దూసుకుపోతుండగా.. ఈ సారి మాత్రం భారీగా దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా పుత్తడి రేటు దిగి వచ్చింది. ఈ వారంలో మాత్రం కాస్త పెరిగింది. మరి పండుగ ముందు రోజు పసిడి ధర ఎలా ఉంది.. వెండి రేటు తగ్గిందా పెరిగిందా అంటే..
ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగాయి. ఇక నేడు హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర స్థిరంగా ఉంది. అంటే క్రితం సెషన్లో ఉన్న రేటే అనగా రూ.65,540 వద్దే స్థిరంగా ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం రేటులో కూడా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.71,500 వద్ద ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధర స్థిరంగానే ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,650 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ లో బంగారం రేటులో స్వల్ప మార్పులుంటాయి. అందుకు కారణం స్థానికంగా విధించే పన్నులు.
ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం పెరిగింది. ఇవాళ కిలో వెండి రేటు స్వల్పంగా పెరిగింది. కిలో మీద రూ.100 పైకి ఎగబాకింది. నేడు ఢిల్లీలో వెండి ధర కిలో మీద రూ.100 వరకు పెరిగి.. రూ.83,700 ఉంది. అలానే హైదరాబాద్ లో సిల్వర్ రేటు కిలో మీద 100 పెరిగి రూ.87,900 కు చేరింది. పండుగ ముందు గోల్డ్ రేటు స్థిరంగా ఉండటం మంచి పరిణామం అని.. పసిడి ప్రియులు త్వరపడితే మంచిది అంటున్నారు.