iDreamPost
android-app
ios-app

బంగారం కొనుగోలుదారులకు ఊరట.. నేటి ధరలు ఇవే!

  • Published Jul 31, 2023 | 7:47 AMUpdated Jul 31, 2023 | 7:47 AM
  • Published Jul 31, 2023 | 7:47 AMUpdated Jul 31, 2023 | 7:47 AM
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. నేటి ధరలు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించే వార్త ఇది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు దిగి వస్తోన్న మన దగ్గర మాత్రం పైపైకి ఎగబాకుతూనే ఉంది. ఇక వెండి ధర కూడా తానేమి తక్కువ కానట్లు.. బంగారం బాటలోనే పైపైకి ఎగబాకింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర వరుసగా పెరగడమే తప్ప.. దిగి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. రెండు రోజుల క్రితం అనగా శనివారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. కానీ మరుసటి రోజే అనగా ఆదివారం బంగారం ధర పెరిగి షాక్‌ ఇవ్వగా సోమవారం కాస్త ఊరటనిచ్చింది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో బంగారం ధర పది గ్రాముల మీద 250 రూపాయలు పెరిగింది. దాంతో 22 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి రేటు 55,350 రూపాయల వద్ద ట్రేడయ్యింది. ఇక నేడు పసిడి రేటు స్థిరంగా ఉండటంతో.. క్రితం సెషన్‌ ధరే కొనసాగింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 55,350 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 60,380గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి రేటు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 55,500 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల రేటు రూ. 60,530గా ఉంది.

బంగారం బాటలోనే వెండి రేటు..

ఆదివారం నాడు సిల్వర్‌ రేటు భారీగా పెరగ్గా.. సోమవారం మాత్రం వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగింది. క్రితం సెషన్‌లో ఢిల్లీలో కిలో వెండి ధర 600 రూపాయలు పెరిగి రూ.77 వేల మార్కుకు చేరగా.. సోమవారం అదే ధర కొనసాగింది. నేడు హస్తినలో కిలో సిల్వర్‌ రేటు 77 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆదివారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగి 80 వేల మార్కుకు చేరింది. నేడు అనగా సోమవారం అదే ధర అనగా 80,000 రూపాయలే కొనసాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి