iDreamPost
android-app
ios-app

పెరుగుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్‌.. తులం రేటు ఎంతుందంటే!

  • Published Jul 24, 2023 | 8:00 AMUpdated Jul 24, 2023 | 8:00 AM
  • Published Jul 24, 2023 | 8:00 AMUpdated Jul 24, 2023 | 8:00 AM
పెరుగుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్‌.. తులం రేటు ఎంతుందంటే!

బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు పసిడి రేటు గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 60 వేల రూపాయలకు పైగా ఉంది. అలానే 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు 55 వేల రూపాయలకు పైగా కొనసాగుతోంది. ఇక వెండి ధర గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. కిలో వెండి రేటు వేల రూపాయల్లో పెరిగింది. ఇక జూన్‌ నెల మొత్తం దిగి వచ్చిన బంగారం ధర.. జూలై ఆరంభంలో అదే పంథా కొనసాగింది. కానీ గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం, తగ్గడం చేస్తున్నాయి. ఇక మరి కొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. పుత్తడికి విపరీతమైన గిరాకీ పెరుగుతుందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత రోజులుగా పరిగెడుతున్న పసిడి ధరకు నేడు బ్రేక్‌ పడింది. ఆ వివరాలు..

నేడు అనగా సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. గత రెండు సెషన్లలో గోల్డ్‌ రేటు తగ్గగా.. నేడు మాత్రం స్థిరంగా కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 55,150 పలుకుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన పసిడి 10గ్రాముల ధర రూ. 60,160 వద్ద స్థిరంగా కొనసాగుతూ ఉంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో చూసుకున్నట్లయితే నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధరలో ఎలాంటి మార్పు లేదు. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 55,300 పలుకుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 60,320 వద్ద ఉంది.

బంగారం బాటలోనే సిల్వర్‌…

ఈ నెలలో వెండి ధర విపరీతంగా పెరిగింది. అయితే నేడు మాత్రం సిల్వర్‌ కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. స్థిరంగా కొనసాగుతోంది. గత రెండ రోజుల్లో హైదరాబాదలో కిలో వెండి ధర ఏకంగా రూ. 1900 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం మాత్రం వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి రేటు రూ. 80,500 వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా వెండి ధర స్థిరంగా ఉంది. హస్తినలో నేడు కిలో వెండి ధర రూ. 78 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బంగారం ధర మాత్ర తక్కువగానే ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు ఇందుకు కారణమవుతాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు సెషన్లలో బంగారం ధర దిగిరాగా.. సోమవారం మాత్రం స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1962 డాలర్ల వద్ద ఉంది. అలానే స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 24.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే వరుసగా పెరుగుతూ వెళ్లిన గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ దిగివస్తుండడం ఊరట కలిగిస్తోంది. క్రితం రెండు సెషన్లలో భారీగా పడిపోయాయి. ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగివస్తుండడం, ఇక్కడ గిరాకీ తగ్గడం వంటి కారణాలు అందుకు దోహదపడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి