Dharani
బంగారం కొనాలనుకునే వారికి శుక్రవారం నాడు భారీ షాక్ తగిలింది. గత రెండు, మూడు రోజులుగా దిగి వచ్చిన గోల్డ్ రేటు ఈ రోజు భారీగా పెరిగింది. ఆ వివరాలు..
బంగారం కొనాలనుకునే వారికి శుక్రవారం నాడు భారీ షాక్ తగిలింది. గత రెండు, మూడు రోజులుగా దిగి వచ్చిన గోల్డ్ రేటు ఈ రోజు భారీగా పెరిగింది. ఆ వివరాలు..
Dharani
బంగారం కొనాలంటే.. భయపడే పరిస్థితి. ఏ రోజు రేటు ఎలా ఉంటుందో.. ఏ రోజు తగ్గుతుందో అర్థం కానీ పరిస్థితులు ఉన్నాయి. వరుసగా రెండు రోజులు గోల్డ్ రేటు దిగి వస్తే.. మరో మూడు రోజుల పాటు భారీగా పెరుగుతుంది. హమ్మయ్య.. పసిడి రేటు దిగి వస్తుంది.. కొనుగోలు చేద్దామని భావించే లోపే.. భారీగా పెరిగి షాక్ ఇవ్వడం ప్రారంభించింది. ఇక గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. ఇందుకు కారణం.. త్వరలోనే వివాహాది శుభకార్యల సీజన్ ప్రారంభం కానుంది. దాంతో ఇప్పటి నుంచే పసిడి కొనుగోళ్లు జోరందకున్నాయి. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో పుత్తడి ధర ఎంత పెరిగింది.. ఏ నగరాల్లో ఎంత ఉంది అంటే..
నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద 200 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యగనంరలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,300కు చేరింది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన మేలిమి పసిడి రేటు 10 గ్రాముల మీద భారీగానే పెరిగింది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాముల మీద 260 రూపాయలు పెరిగి.. రూ.73,420 గా ఉన్నాయి.
ఇక హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం రేటు భారీగానే పెరిగింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్ పసిడి రేటు 10 గ్రాముల మీద 200 రూపాయలు పెరిగి.. రూ. 67,240 వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల రేటు 260 రూపాయలు పెరిగి.. రూ. 73, 340 చేరింది.
నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పెరగ్గా.. వెండి కూడా అదే బాటలోనే పయనిస్తోంది. క్రితం సెషన్‌లలో దిగి వస్తోన్న సిల్వర్ రేటు.. నేడు భారీగా పెరిగింది. ఇవాళ ఒక్క రోజే వెండి ధర కిలో మీద ఏకంగా రూ. 1000 మేర పెరిగింది. దాంతో నేడు ఢిల్లీలో వెండి ధర కిలో మీద 1000 రూపాయలు పెరిగి.. వెండి రూ. 95,000 వద్ద కొనసాగుతోంది. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిల్వర్ రేటు కిలో మీద 1000 రూపాయలు పెరిగింది. ఇవాళ హైదారబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రేటురూ. 1,00, 000 వద్ద కొనసాగుతోంది.