iDreamPost
android-app
ios-app

Gold Price: పసిడి ప్రియులకు నిరాశ.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Published Aug 10, 2024 | 8:06 AM Updated Updated Aug 10, 2024 | 1:13 PM

Gold, Silver Price: గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర నేడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. భారీగా పెరిగింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఎంత పెరిగిందంటే..

Gold, Silver Price: గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర నేడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. భారీగా పెరిగింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఎంత పెరిగిందంటే..

  • Published Aug 10, 2024 | 8:06 AMUpdated Aug 10, 2024 | 1:13 PM
Gold Price: పసిడి ప్రియులకు నిరాశ.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత.. మన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. గత పది రోజులుగా మన దగ్గర గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు దిగి వస్తున్నాయి. దాంతో జనాలు బంగారం కొనడానికి ఎగబడుతున్నారు. పైగా శ్రావణమాసం, పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ మొదలు కావడంతో.. పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జ్యూవెలరీ షాపులన్ని కిటకిటలాడుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న పుత్తడి ధర.. నేడు మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగి షాకిచ్చింది. ఇవాళ దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు.. భారీగా పెరిగాయి. మరి నేడు దేశంలో బంగారం ధర ఎంత ఉందంటే..

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో దిగి వచ్చిన పసిడి ధర.. నేడు మాత్రం భారీగా పెరిగింది.  ఇవాళ భాగ్యనగరంలో 24 క్యారెట్‌ మెలిమి బంగారం ధర 10 గ్రాముల మీద ఏకంగా రూ.820 పెరిగింది. దాంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర రూ. 70,090 కు చేరింది. అలానే బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు పది గ్రాముల మీద రూ.750 పెరిగి 64,250 వద్దకు చేరింది.

today gold rate

అలానే నేడ ఢిల్లీ మార్కెట్‌లో కూడా గోల్డ్‌ రేట్లు పెరిగాయి. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ పసిడి పది ధర పది గ్రాముల మీద రూ. 750 పెరిగి 64,400 రూపాయలకు చేరింది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల మీద రూ. 820 పెరిగి రూ. 70,240 వద్దకు చేరింది.

రూ.1500 పెరిగిన వెండి ధర

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం రేటు దిగి రాగా.. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా పెరిగి షాక్‌ ఇచ్చింది. ఇక నాలుగు రోజుల్లో సిల్వర్‌ రేటు కేజీ మీద రూ. 4500 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దిగి వచ్చిన వెండి ధర.. నేడు భారీగా పెరిగింది. సిల్వర్‌ రేటు కేజీ మీద ఏకంగా రూ.1500 పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి రేటు రూ. 88 వేలకు ఎగబాకింది. అలానే ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు రూ. 83 వేల స్థాయికి చేరింది. అయితే జీఎస్టీ సహా స్థానిక పన్నులు కలిపితే పైన పేర్కొన్న ధరల్లో తేడా ఉంటుంది. కొనుగోలు చేసే ముందు ఉన్న ధరలు కనుక్కోవడం మంచిది.