iDreamPost
android-app
ios-app

Gold Price: బంగారం కొనాలంటే త్వరపడండి.. రెండో రోజు కూడా భారీగా తగ్గిన ధర

  • Published Jul 10, 2024 | 7:54 AM Updated Updated Jul 10, 2024 | 7:54 AM

బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడే త్వరపడండి.. రెండు రోజుల వ్యవధిలోనే గోల్డ్‌ రేటు భారీగా దిగి వచ్చింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడే త్వరపడండి.. రెండు రోజుల వ్యవధిలోనే గోల్డ్‌ రేటు భారీగా దిగి వచ్చింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

  • Published Jul 10, 2024 | 7:54 AMUpdated Jul 10, 2024 | 7:54 AM
Gold Price: బంగారం కొనాలంటే త్వరపడండి.. రెండో రోజు కూడా భారీగా తగ్గిన ధర

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉంది పసిడి ధర తీరు. ఇక వెండి రేటు అయితే ఏకంగా లక్ష రూపాయలకు చేరుకుంది. ఇన్నాళ్లు అంటే పండగలు, శుభకార్యాలు లేవు కాబట్టి పసిడి కొనుగోళ్లు పెద్దగా లేవు. కానీ మరి కొన్ని రోజుల్లో పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ మొదలు కానుంది. దాంతో గోల్డ్‌కు డిమాండ్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో కొన్ని రోజులు పెరగడం.. మరి కొన్ని రోజులు దిగి రావడం చేస్తోంది. ఇక క్రితం సెషన్‌లో దిగి వచ్చిన పసిడి రేటు.. నేడు కూడా దిగి వచ్చింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. ఎంత మేర తగ్గాయి అంటే..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండవ రోజు కూడా దిగివచ్చాయి. క్రితం సెషన్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర పది గ్రాముల మీద 200 రూపాయలు తగ్గింది. నేడు కూడా అదే బాటలో పయనిస్తూ.. 10 గ్రాముల మీద 350 రూపాయలు దిగి వచ్చింది. ఈ రెండు రోజుల్లో పుత్తడి రేటు పది గ్రాములు మీద 550 రూపాయలు తగ్గింది. ఇక నేడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ పసిడి 10 గ్రాముల పసిడి రేటు.. రూ. 67,100కు దిగి వచ్చింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద రూ.380 తగ్గి రూ. 73,200 వద్దకు దిగివచ్చింది.

ఇక దేశరాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కూడా గోల్డ్‌ ధర భారీగానే దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద 350 రూపయాలు తగ్గి.. రూ. 67,250 వద్దకు దిగివచ్చింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం పది గ్రాముల మీద రూ. 380 తగ్గి రూ. 73,350 వద్దకు దిగివచ్చింది.

దిగి వచ్చిన వెండి ధర..

నేడు వెండి రేటు.. పసిడి దారిలోనే పయనిస్తూ.. భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం నాడు సిల్వర్‌ రేటు కిలో మీద రూ.500 మేర దిగివచ్చింది. దాంత నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 99 వేల వద్దకు పడిపోయింది. ఇక ఢిల్లీలో చూసుకుంటే కిలో నేడు వెండి రేటు కిలో మీద రూ. 500 తగ్గి రూ. 94, 500కు చేరుకుంది. అయితే ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువ ఉంటుంది. ఇందుకు కారణం స్థానికంగా విధించే పన్నులు.