iDreamPost
android-app
ios-app

Gold Price: అదిరిపోయే శుభవార్త.. భారీగా కుప్పకూలిన గోల్డ్‌ రేటు.. ఎంత తగ్గిందంటే

  • Published Jul 26, 2024 | 7:59 AM Updated Updated Jul 26, 2024 | 7:59 AM

Gold & Silver Price Dropped On 26th July: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు. బంగారం ధర భారీగా దిగి వచ్చింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేటు ఎంత మేర దిగి వచ్చింది అంటే..

Gold & Silver Price Dropped On 26th July: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు. బంగారం ధర భారీగా దిగి వచ్చింది. నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేటు ఎంత మేర దిగి వచ్చింది అంటే..

  • Published Jul 26, 2024 | 7:59 AMUpdated Jul 26, 2024 | 7:59 AM
Gold Price: అదిరిపోయే శుభవార్త.. భారీగా కుప్పకూలిన గోల్డ్‌ రేటు.. ఎంత తగ్గిందంటే

బంగారం కొనాలనుకునే వారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. బడ్జెట్‌లో పసిడి, వెండి వంటి ఖరీదైన లోహాల మీద కస్టమ్స్‌ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ లోహాల రేట్లు భారీగా దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా రేట్లు స్థిరంగా ఉన్నా.. మన దగ్గర మాత్రం తగ్గాయి. మన దగ్గర పండగలు, వివాహాల సీజన్‌లో బంగారం కొనగోళ్లు భారీగా ఉంటాయి. మిగతా సమయాల్లో పెద్దగా ఆసక్తి చూపరు. అప్పుడు డిమాండ్‌ తక్కువ.. రేటు కూడా కాస్త దిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గత  కొంతకాలంగా పండగలు వంటివి లేకపోయినా.. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వెలువడుతుండటంతో.. ఏప్రిల్, మే నెలల్లో పుత్తడి రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి.

అయితే జూన్ నెలలో కాస్త తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ జూలై ఆరంభంలో కూడా ఎగబాకాయి. అయితే గత 8 రోజులుగా పుత్తడి ధర దిగి వస్తోంది.. లేదంటే స్థిరంగా ఉంటుంది. దాంతో పసిడి ప్రియులు బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే మంచి అవకాశం అంటున్నారు. ఇక నేడు కూడా గోల్డ్‌  రేటు దిగి వచ్చింది. మరి నేడు ధర ఎంత తగ్గింది అంటే..

గత నాలుగు రోజులుగా దిగి వచ్చిన బంగారం ధర.. నేడు కూడా తగ్గింది. ఇక నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద ఏకంగా రూ. 950 తగ్గింది. దాంతో నేడు భాగ్యనగరంలో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర రూ. 64 వేల మార్కుకు చేరింది. అంతకుముందు సెషన్లలో కూడా పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. ఇన్ని రోజుల్లో సుమారు 5 వేల వరకు బంగారం ధర పడిపోయిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు పది గ్రాముల మీద ఏకంగా రూ. 1040 పతనం అయ్యి ప్రస్తుతం రూ. 69,820 కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు దిగి వచ్చింది. హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల మీద 950 రూపాయలు దిగి వచ్చింది. దాంతో నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ. 64,150 కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్‌ ప్యూర్ గోల్డ్ రేటు పది గ్రాముల మీద రూ. 1040 తగ్గి 69,950 రూపాయలకు దిగి వచ్చింది.

బంగారం బాటలోనే వెండి..

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి రాగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది. నేడు సిల్వర్‌ రేటు కేజీ మీద ఏకంగా 3 వేల రూపాయలు తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడు వెండి ధర రూ. 3 వేలు తగ్గి కిలో రూ. 84,500 కు చేరింది. ఈ 8 రోజుల్లోనే వెండి రేటు కిలో మీద ఏకంగా రూ. 11 వేలకుపైగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో వెండి రేటు రూ. 3 వేలు పతనంతో కిలోకు రూ. 89 వేల వద్దకు దిగి వచ్చింది.