iDreamPost

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

గోల్డ్ అంటే ఇష్టపడే వారు బహుషా మనదేశంలోనే ఎక్కువగా ఉంటారేమో. ఏ చిన్న వేడుక అయినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. వివాహాలకు, బర్త్ డే ఫంక్షన్లకు, ఆత్మీయులకు గిఫ్టులుగా ఇచ్చేందుకు తరచుగా పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ధరలు పెరిగినప్పటకీ కూడా గోల్డ్ కొనేందుకు మాత్రం వెనకాడరు. బంగారానికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు మహిళలు. అయితే బంగారం కొనాలని అనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. బంగారం ధరల్లో భారీగా తగ్గుదల చోటుచేసుకుంది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే రీతిలో తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవటం వంటి కారణాలు బంగారం దేశీయంగా బంగారం దరల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు గత మూడు, నాలుగు రోజుల నుంచి తగ్గుతున్నాయి. ఇది పసిడి కొనాలనుకునే వారికి శుభవార్తే అని చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,840 ఉండగా ఈ రోజు రూ. 340 తగ్గి రూ. 54, 500 వద్దకు చేరింది. అలాగే నిన్నటి రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59, 830 ఉండగా నేడు రూ. 380 తగ్గి రూ. 59,450కి చేరింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600కి చేరుకుంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,780 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈ రోజు రూ. 73,500లుగా ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000ల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000లకు చేరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి