iDreamPost
android-app
ios-app

ఆరోజున ఆ బ్యాంకు సర్వీసులు పని చేయవు.. ఏమైనా ఉంటే ముందే చూసుకోండి

  • Published Jul 09, 2024 | 10:09 PM Updated Updated Jul 09, 2024 | 10:09 PM

These Bank Services Temporary Closed: అప్పుడప్పుడూ బ్యాంకులు షెడ్యూల్ మెయింటెనెన్స్, అప్ గ్రేడ్ లో భాగంగా బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తుంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజున కొన్ని బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసింది. కాబట్టి ఏమైనా లావాదేవీలు, చెల్లింపులు వంటివి ఉంటే ఆ తేదీ లోపే చూసుకోండి.

These Bank Services Temporary Closed: అప్పుడప్పుడూ బ్యాంకులు షెడ్యూల్ మెయింటెనెన్స్, అప్ గ్రేడ్ లో భాగంగా బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తుంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజున కొన్ని బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసింది. కాబట్టి ఏమైనా లావాదేవీలు, చెల్లింపులు వంటివి ఉంటే ఆ తేదీ లోపే చూసుకోండి.

  • Published Jul 09, 2024 | 10:09 PMUpdated Jul 09, 2024 | 10:09 PM
ఆరోజున ఆ బ్యాంకు సర్వీసులు పని చేయవు.. ఏమైనా ఉంటే ముందే చూసుకోండి

బ్యాంకులు అప్పుడప్పుడూ సిస్టమ్స్ ని అప్ గ్రేడ్ చేస్తుంటాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం.. బ్యాంకింగ్ అనుభూతిని మెరుగుపర్చడం కోసం అప్ గ్రేడ్ ప్రక్రియను నిర్వహిస్తుంటాయి. ఇలా అప్ గ్రేడ్ ప్రక్రియను నిర్వహించినప్పుడు ఆ రోజు వరకూ కొన్ని గంటల పాటు బ్యాంకులు కొన్ని సర్వీసులను నిలిపివేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, ఏటీఎం విత్ డ్రాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీలు వంటి వాటిని నిలిపివేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం పరిమిత సేవలను అందిస్తాయి. తాజాగా ఓ ప్రముఖ బ్యాంక్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ సిస్టమ్స్ అప్ గ్రేడ్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజున కొన్ని బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.  

దేశీయ దిగ్గజ ప్రైవేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 13న సిస్టమ్ అప్ గ్రేడ్ లో భాగంగా కొన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. శనివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ అప్ గార్డ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఆ సమయంలో కొన్ని బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. పదమూడున్నర గంటల పాటు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూపీఐ, ఏటీఎం సేవలు, డెబిట్ కార్డు సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ సేవలు జూలై 13న ఉదయం 3 గంటల నుంచి 3.45 గంటల వరకూ అందుబాటులో ఉండవని.. 3.45 నుంచి 9.30 వరకూ యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయని.. ఆ తర్వాత మళ్ళీ 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ అందుబాటులో ఉండవని తెలిపింది. మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 4.30 వరకూ యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది.

అయితే ఏటీఎం సేవలు, డెబిట్ కార్డు సేవలపై కొన్ని పరిమితులు విధించింది. ఉదయం 3 గంటల నుంచి 3.45 వరకూ ఏటీఎం, డెబిట్ కార్డు సేవలు పరిమిత షరతులతో అందుబాటులో ఉంటాయని.. 3.45 నుంచి ఉదయం 9.30 వరకూ పూర్తిగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆ తరువాత 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ మళ్ళీ పరిమిత షరతులతో ఏటీఎం, డెబిట్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని.. ఆ తర్వాత 12.45 నుంచి సాయంత్రం 4.30 గంటలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం పాక్షికంగా అందుబాటులో ఉంటాయి. ఫండ్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఈ సర్వీసును జూలై 13న పూర్తిగా రద్దు చేసింది. క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు, ఐఎన్ఆర్ కార్డులు వాడేవారికి మాత్రం ఆ సేవలపై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అయితే ఏమైనా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు ఉంటే జూలై 12కి ముందుగానే చెల్లించాలని బ్యాంక్ తెలిపింది. అలానే విత్ డ్రాలు, వేరే చెల్లింపులు, బ్యాంకు సంబంధిత లావాదేవీలు ఏమైనా ఉంటే ముందుగానే చూసుకోవాలని బ్యాంకు తెలిపింది.  

  • దీని గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.