iDreamPost

మరో మాదాపూర్‌గా దూసుకెళ్తున్న ఏరియా.. 2 నెలల్లోనే ఊహించని లాభాలు!

Another Madhapur: ఆ ఏరియా ఖచ్చితంగా మరో మాదాపూర్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు రీసెంట్ గా చెప్పడం.. దానికి తగ్గట్టే ఆ ఏరియా దూకుడు చూపిస్తుంది. రెండు నెలల క్రితం, అంతకు ముందు ఈ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేసిన వారికి ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. రెండు నెలల క్రితం పెట్టుబడి పెట్టిన వారికైతే భారీ లాభాలు వచ్చాయి.

Another Madhapur: ఆ ఏరియా ఖచ్చితంగా మరో మాదాపూర్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు రీసెంట్ గా చెప్పడం.. దానికి తగ్గట్టే ఆ ఏరియా దూకుడు చూపిస్తుంది. రెండు నెలల క్రితం, అంతకు ముందు ఈ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేసిన వారికి ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. రెండు నెలల క్రితం పెట్టుబడి పెట్టిన వారికైతే భారీ లాభాలు వచ్చాయి.

మరో మాదాపూర్‌గా దూసుకెళ్తున్న ఏరియా.. 2 నెలల్లోనే ఊహించని లాభాలు!

హైదరాబాద్ నగర విస్తీర్ణం ఇప్పుడు మరింత పెరుగుతుంది. ఒకవైపు జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతుండడం, మరోవైపు నగర పరిసర ప్రాంతాలను డెవలప్ చేస్తుండడం వంటివి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పై అందరి కన్ను పడేలా చేస్తుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ నిపుణులు పలు ప్రాంతాలను మరో హైటెక్ సిటీగా, మరో గచ్చిబౌలిగా, మరో కూకట్ పల్లిగా అభివర్ణిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో డెవలప్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కంపెనీలు, పలు ఇండస్ట్రీస్ ని కలిగి ఉండడం వంటివి ఈ ప్రాంతాలను హైదరాబాద్ లోని ప్రముఖ ఏరియాలతో పోలుస్తున్నారు. తాజాగా ఈ ప్రాంతాన్ని మరో మాదాపూర్ గా పిలుస్తున్నారు. భవిష్యత్తులో మాదాపూర్ గా మారనుందని చెబుతున్నారు. అయితే మాదాపూర్ గా మారకముందే ఆ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేసిన వారికి 2 నెలల్లో ఏకంగా 5 లక్షలు లాభం తెచ్చిపెట్టింది.  

తెలంగాణ ప్రభుత్వం పాతబస్తీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకి మెట్రో అలైన్మెంట్ కోసం గతంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. హైదరాబాద్ కి అవతల ఉన్న ఎయిర్ పోర్టుకి మెట్రోను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకూ ఉన్న ఏరియాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది. వీటిలో శంకరపల్లి ఏరియాలో రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. జనవరి-మార్చి నెలల్లో శంకరపల్లిలో చదరపు అడుగు స్థలం సగటున 1900 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 2350 రూపాయలకు పెరిగింది. అంటే 1200 చదరపు అడుగుల స్థలం (2 బీహెచ్కేకి సరిపడా స్థలం) యావరేజ్ గా రూ. 22,80,000 ఉండేది.

ఇప్పుడు అదే స్థలం విలువ సగటున 28,20,000 అయ్యింది. అంటే రెండు నెలల క్రితం 1200 చదరపు అడుగుల స్థలం మీద ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ. 5,40,000 లాభం వచ్చినట్టు. మరి నిపుణులు చెప్పినట్టు శంకరపల్లి మరో మాదాపూర్ అవ్వడానికి ఎంతో దూరంలో లేదని ఈ రిజల్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మెట్రో కనెక్టివిటీ వస్తుండడం వల్ల ఈ ఏరియాకి ఫుల్ డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. మీరు కనుక ఇంకా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయకపోతే కనుక వెంటనే ఇన్వెస్ట్ చేయండి. అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు.  

గమనిక:

అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి