iDreamPost

మరో జూబ్లీహిల్స్‌గా ఆ ఏరియా.. ఇక్కడ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు!

Another Jubilee Hills: హైదరాబాద్ లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేదని బాధపడేవారికి మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే.. జూబ్లీహిల్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Another Jubilee Hills: హైదరాబాద్ లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేదని బాధపడేవారికి మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే.. జూబ్లీహిల్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరో జూబ్లీహిల్స్‌గా ఆ ఏరియా.. ఇక్కడ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు!

హైదరాబాద్ లో ఉండడానికి ఇల్లు ఎక్కడ కొనుకున్నా పర్లేదు. డబ్బులుండాలే గానీ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ ఏరియా డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ గ్రోత్, ధరలు ఎంత తక్కువగా ఉన్నాయి? ఎంత ఎక్కువ లాభాలు వస్తున్నాయి? వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఏరియాల మీద ఇన్వెస్ట్ చేసి ఎలా అయితే కోటీశ్వరులు అయ్యారో.. అలాంటి ల్యాండ్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఏరియా గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 

ఆ ఏరియా… హైదరాబాద్-విజయవాడ హైవే. నేషనల్ హైవే అవ్వడం, 6 లైన్స్ రోడ్ వస్తుండడం, అవుటర్ రింగ్ రోడ్ కి, రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ ఏరియాకి డిమాండ్ అనేది పెరిగిపోయింది. హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్స్ ని కొనేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్నాళ్లూ సౌత్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాలు డెవలప్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు తూర్పు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్-విజయవాడ హైవేపై ఫోకస్ పెట్టారని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ స్థలాలు కొన్నాగానీ లాభం ఉంటుందని.. అయితే హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్స్ లో కొనుగోలు చేయడం వల్ల ఫ్యూచర్ లో ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

విజయవాడ హైవేలో గజం 8 వేల నుంచి మొదలై 10 వేలు, 12 వేలు రేంజ్ లో ఉన్నాయి. ఒక 150 గజాల స్థలానికి 12 లక్షల నుంచి 18 లక్షలు అవుతాయి. 20 లక్షల్లో మంచి స్థలం కొనుగోలు చేయవచ్చు. పైగా మీరు కొనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి సిటీకి దూరంగా ఉందన్న దిగులు అవసరం లేదు. ఫ్యూచర్ లో విజయవాడ హైవేకి, సిటీకి కనెక్టివిటీ అనేది వస్తుంది. దీని వల్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. అప్పుడు స్థలాలపై డిమాండ్ అనేది పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అంటున్నారు. ఇప్పుడు విజయవాడ హైవే దగ్గర ఉన్న స్థలాల మీద ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికి లక్షకు 4, 5 లక్షలు వస్తాయని చెబుతున్నారు. విజయవాడ హైవే మరో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ గా అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విజయవాడ హైవేలో ప్రస్తుతం చదరపు అడుగు స్థలం యావరేజ్ గా రూ. 1400గా ఉంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే ఈ ధర రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెరుగుతుందని అంటున్నారు.       

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి