iDreamPost

సిటీలో కొత్త గచ్చిబౌలి.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు 5 రెట్లు అవుతుంది

గచ్చిబౌలిలో ఇప్పుడు స్థలం కొనాలంటే సామాన్యులకి అయ్యే పని కాదు. అయితే గచ్చిబౌలిలా మారనున్న ఏరియాలో స్థలం కొనగలరు కదా. కొంటే రాబోయే రోజుల్లో సామాన్యులు కాదు.. ధనవంతులవుతారు. అలాంటి ఏరియా గురించే మీరు తెలుసుకోబోతున్నారు.

గచ్చిబౌలిలో ఇప్పుడు స్థలం కొనాలంటే సామాన్యులకి అయ్యే పని కాదు. అయితే గచ్చిబౌలిలా మారనున్న ఏరియాలో స్థలం కొనగలరు కదా. కొంటే రాబోయే రోజుల్లో సామాన్యులు కాదు.. ధనవంతులవుతారు. అలాంటి ఏరియా గురించే మీరు తెలుసుకోబోతున్నారు.

సిటీలో కొత్త గచ్చిబౌలి.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు 5 రెట్లు అవుతుంది

భూమి విలువ ఆకాశాన్ని అంటుతోంది. ఒకప్పుడు భూమిని మన తాత, ముత్తాతలు ఎకరాల్లో కొనేవారు. తర్వాత తరం గజాల్లో కొనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు చదరపు అడుగుల్లో కొనే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో అంగుళాలు, సెంటీమీటర్లలో కొనే పరిస్థితి వచ్చేలా ఉంది భూమి డిమాండ్ చూస్తుంటే. కాబట్టి భూమికి ఉన్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని చెబుతారు రియల్ ఎస్టేట్ నిపుణులు. మీరు కనుక ఫ్యూచర్ లో ల్యాండ్ రేటు అమాంతం పెరిగిపోయే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు ఈ ఏరియా బాగా ఉపయోగపడుతుంది.    

గచ్చిబౌలిలో ఇప్పుడు ఒక చదరపు అడుగు స్థలం కొనాలంటే లక్ష, 2 లక్షలు రేంజ్ లో ఉంది. ఒకప్పుడు గచ్చిబౌలిలో ఈ రేట్లు లేవు. కానీ ఇవాళ ఈ రేట్లు ఉన్నాయంటే దానికి కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం, కంపెనీలు, ఇండస్ట్రీలు ఉండడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటివి. ఇప్పుడు గచ్చిబౌలి ఎలా అయితే ఉందో.. అలాంటి గచ్చిబౌలి ఒకటి రెడీ అవుతోంది. ఆ ఏరియా పేరు షాద్ నగర్. బెంగళూరు హైవే మీద ఉన్న కారణంగా డిమాండ్ అనేది ఉంది. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న షాద్ నగర్ ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. అతి త్వరలోనే ఈ  పట్టణం గచ్చిబౌలిగా అవతరించనుంది.

ఎందుకంటే ఈ ఏరియాలో పోలేపల్లి సెజ్ తో పాటు 3 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు-నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా.. ఈ మూడు ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇండస్ట్రీలు రానున్నాయి. అలానే షాద్ నగర్ లో అమెజాన్ డేటా సెంటర్ రూపొందుతుంది. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్ కోసం షాద్ నగర్ లో 48 ఎకరాలు కొనుగోలు చేసింది. పోలేపల్లి సెజ్ లో పలు ఫార్మా కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రానున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, నాట్కో, ఎంఎస్ఎన్ ఫార్మా వంటివి షాద్ నగర్ లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఆపరేషన్ లో ఉండగా.. కొన్ని రెడీ అవుతున్నాయి.

ఓవరాల్ గా కంపెనీలు పూర్తి స్థాయిలో డెవలప్ అయితే దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఇది గచ్చిబౌలి సిటీగా మారనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు షాద్ నగర్ లో చదరపు అడుగు 1550 రూపాయలు ఉంది. గజం 14 వేలుగా ఉంది. రోడ్ సేడ్ ఫేసింగ్ ఉన్న స్థలాలు అయితే గజం 25 వేలు, 30 వేల రూపాయలుగా ఉన్నాయి. ఇప్పుడు కొంటే కనుక  రాబోయే ఐదేళ్ళలో ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుందని అంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ళలో 20 లక్షలు అవుతాయి. అంటే ఏడాదికి 2 లక్షలు లాభం వచ్చినట్టు. పదేళ్లు ఆగితే కనుక ఇన్వెస్ట్మెంట్ ఐదు రెట్లు పెరుగుతుందని అంటున్నారు. అంటే ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 50 లక్షలు అవుతుందని అంటున్నారు. పదేళ్లలో 40 లక్షలు లాభమని చెబుతున్నారు. ఏడాదికి 4 లక్షలు లాభం అన్నమాట.   

 గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి